Wednesday, April 24, 2024

సిలిండర్ ధర తగ్గిస్తారా? : ఈటెలకు మంత్రి హరీష్ సవాల్

హుజరాబాద్ లో రాజకీయం వేడెక్కుతోంది మంత్రి హరీష్ రావు, బిజెపి నేత ఈటల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా మంత్రి హరీష్ రావు పై విమర్శలు గుప్పించారు.
గడియారాలు, బొట్టుబిల్లలు ఇవ్వ‌డం కాదు.. ద‌మ్ముంటే సిలిండ‌ర్ ధ‌ర త‌గ్గిస్తామ‌ని చెప్పి హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడ‌గాల‌న్నారు. బీజేపీకి ఓటు వేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్ధతు ఇస్తున్నారని చెప్పి సిలిండర్ ధర రూ. 3 వేలు, నూనె ధ‌ర రూ. 300కు పెంచుతార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధలను తమ బాధలుగా భావించే వృద్దులకు ఆసరా, పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఇస్తోంది. మొన్న వరద వస్తే ఇంటికి రూ. 3800 సాయ‌మందించామ‌ని హ‌రీశ్‌రావు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement