Friday, March 29, 2024

వ‌చ్చే నెల ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పాత వేత‌నాలే?

హైదరాబాద్‌, : కరోనా తీవ్రతతో పొంచి ఉన్న ముప్పు, లాక్‌డౌన్‌తో రాబ డికి చిక్కులతో సర్కార్‌ అతలాకులతం అవుతుం డగా, వచ్చే నెల నుంచి వేతనాలు, పింఛన్లు మరింత భారం కానున్నా యి. తెలంగాణ తొలి పీఆర్సీ నివేదిక ఆధా రంగా ప్రభుత్వం ఫిట్‌మె ంట్‌ను 30 శాతంగా ప్రక టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రభుత్వ వేతనాలు, పింఛన్లు మొత్తం రెవెన్యూ వ్యయంలో 36.16 శాతానికి చెెరడంతో ఫిట్‌మెంట్‌ అమలు మరింత భారం కానుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పన్నుల ఆదాయంలో వైద్యరంగానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తోంది. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నా యని అధికార వర్గాలు భావిస్తు న్నాయి. ఈ నేపథ్య ంలో జూన్‌ మొదటి వారంలో ఉద్యోగుల వేత నాలు, పింఛన్లు పాత పద్దతిలోనే చెల్లింపులు జరగనున్నాయి. రెవెన్యూ పద్దుకింద ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఖర్చుల్లో వడ్డీ చెల్లింపులు, జీతాలు, వేతనాలు, పించన్లు, సబ్సిడీల వ్యయాల లెక్కలను ఆర్ధిక శాఖ సిద్దం చేస్తోంది. ఇందులో ఉద్యోగుల వేతనాల నిధులూ కేటా యిం చడం సహజంగానే జరుగుతుంది. యేటేటా ప్రభుత్వ ఉద్యో గుల వేతనాల భారం ప్రభుత్వంపై పెరుగుదల నమోదవుతోం దని, బడ్జెట్‌ అంచనాలకంటే గతేడాది ఈ వ్యయం 7 శాతం ఎక్కువగా నమో దైందని గుర్తించారు. మొత్తం రెవెన్యూ వ్యయ ంలో జీతాలపై ఖర్చు 36.16 శాతానికి చేరుకుంది. 2014-15లో వేతనాలు, జీతాల ఖర్చు రూ.12,200కోట్లుకాగా 2016-17 నాటికి రూ.21,897కోట్లకు చేరుకున్నది. ఇందులో ప్రణాళికేతర పద్దులో రూ. 20557కోట్ల, ప్రణా ళికా పద్దులో రూ.1340కోట్లుగా ఉన్నది. ఇక వడ్డీ చెల్లింపులకు 2014-15లో రూ.5227కోట్లు అవసరం కాగా 2016-17నాటికి రూ. 8609 కోట్లకు చేరుకున్నది. పించన్లు 2014-15లో రూ.4210 కోట్లు కాగా 2016-17లో రూ.9011 కోట్లుకు చేరింది. ఇక కీలకమైన సబ్సిడీలలో 2014-15లో రూ. 3587కోట్లుకాగా 2016-17కు రూ. 5935 కోట్లకు చేరాయి. మొత్తంగా 2014-15లో ఈ ఖర్చులు రూ. 25224 కోట్లు కాగా 2016-17కు రూ.45452కోట్లకు చేరుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదార్లకు, ఇతర పదవీ విరమణ ప్రయోజ నాలకు 2016-17లో ఖర్చు చేసిన మొత్తం రూ.9011కోట్లు. ఇది రెవెన్యూ రాబడుల్లో 10.88శాతంగా నమోదైంది. రెవెన్యూ వ్యయంలో 11.07శాతంగా ఉన్నది. బడ్జెట్‌ అంచనాలకంటే అధికం కావడంతో సహజంగానే కొంత భారం పడుతోంది. చెల్లింపులన్నీ నిలిపేసిన ఆర్ధిక శాఖ ఉద్యోగులు, పించనర్లకు సకాలంలో వేతనాలు, పించన్లను అందజేస్తోంది.. ప్రతీనెల రూ. 12 వేల కోట్లుగా ఉండే రాబడి ఆదాయం ఈనెలలో ఇంకా రూ. 5వేల కోట్లకు కూడా చేరలేదు. బాండ్ల విక్రయాలు, రుణాలు, కేంద్ర పన్నుల వాటా నిధులు మినహా రాబడులేవీ పుంజుకులోదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలేవి లేకపోగా పొదుపు చర్యలు తప్పనిసరిని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా గతేడాది ఏప్రిల్‌లో వేతనాల్లో కోతనుంచి పోలీస్‌, వైద్య ఆరోగ్య శాఖల ఉద్యోగులకు మినహాయింపునిస్తూ సవరణ జీవో 28ని జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 4,49,516 మంది ఉద్యోగులుం డగా, వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు 4,30,647కాగా, తాత్కాలిక ఉద్యోగులు 18,832 మంది ఉన్నారు. పోలీస్‌ శాఖలో 54వేల మంది ఉద్యోగులుండగా, ఇందులో 397మంది తాత్కాలిక ఉద్యోగులున్నారు. హోంగార్డులను కూడా కలుపుకుని మొత్తం వేతనాలను కోతల్లేకుండా చెల్లించేందుకు సర్కార్‌ సిద్దమైంది. రాష్ట్రవ్యాప్తంగా 4,49,516 మంది ఉద్యోగులు ఉండగా, 2.5లక్షల మంది పించన్‌దారులు న్నారు. వీరికి ప్రభుత్వం ప్రతీనెలా రూ. 3600కోట్లు వేతనాలు, పించన్లకు కేటాయిస్తోంది. గతేడాది మార్చిలో ప్రభుత్వం ఆరీ చేసిన జీవో 27లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75శాతం కోత పడ నుంది. అఖిల భారత సర్వీస్‌ అధికా రుల వేతనాల్లో 60శాతం, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్‌ శాఖల ఉద్యో గులు మినహా అన్ని రకాల ఉద్యోగుల వేత నాల్లో 50శాతం, నాల్గో తరగతి, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల్లో 10శా తం, పెన్షనర్ల పించన్ల్లలో 10శాతం వేతనాల్లో కోత పెట్టింది.
వీటిని వేతనాల్లో కోతకు బదు లుగా వాయిదాగానే పరిగణించాలని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్టు 1897 (సెక్షన్‌-2) ప్రకారం ఉద్యోగుల వేతనాల్లో కొంత భాగాన్ని వాయిదా వేస్తున్నట్లుగా జీవో 27 తర్వాత మరో సర్య్కులర్‌లో ఆర్ధిక శాఖ స్పష్టతనిచ్చింది. కరోనా నేపథ్యంలో అత్యవసరాలకు, రాష్ట్ర ప్రజల వైద్య సేవలకు, ఇతర అత్యవసర కొను గోళ్లకు నగదు రిజర్వును ముందు జాగ్రత్తగా తమవద్ద పెట్టుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత కోత పెట్టిన మొత్తాలను వేతనాలతో కలిపి అందజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement