Saturday, April 20, 2024

వీడుతున్న పుట్ట మిస్ట‌రీ

పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
పోలీసుల అదుపులో మధు
వామన్‌రావు హత్యకేసు విచారణకు ప్రత్యేక కోర్టు
హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు ప్రభుత్వం లేఖ
అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు ఏంటా మిస్టరీ

హైదరాబాద్‌, : గట్టు వామన్‌రావు హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాస్త ఆలస్య మైనా ఈ వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయిం చడంతో అనేకమంది నేతల జాతకాలు మారిపోయే అవకాశాలు కనిపి స్తున్నాయి. రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి. వామన్‌రావు హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు న్యాయశాఖ కార్య దర్శి లేఖ రాశారు. కరీంనగర్‌ సెషన్స్‌ కోర్టును ప్రత్యేక కోర్టుగా గుర్తించాలని, విచారణ వేగంగా జరిగేలా చూడాలని ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. న్యాయవాద దంపతులు వామన్‌ రావు, నాగమణిని పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద మధ్యాహ్నం నడి రోడ్డుపై దారుణ హత్యకు గురయ్యారు. కారులో ప్రయాణిస్తున్న దంపతులను ప్రత్యర్థులు కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేప ట్టారు. కుంట శ్రీను, కుమార్‌, చిరంజీవి నిందితులుగా ఉన్నారు. తమ పనులకు అడ్డు పడుతున్నారనే హత్య చేశామని నేరాన్ని అంగీకరిం చారు. గతంలోనే రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు హత్యకు ఉపయో గించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్ష్యులను విచారించి మెజిస్ట్రేట్‌ సమక్షంలో వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుపైనా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది.
పోలీసుల అదుపులో మధు
కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్ని రోజులు కనిపించకపోవడంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో మధును పోలీసులు విచారించారు. ఇటీవల వామన్‌రావు తండ్రి మరో ఫిర్యాదు చేయగా, అందులోని అంశాలపై పుట్ట మధును పోలీసులు ప్రశ్నిస్తు న్నారు. వారం రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్ళడం, వామన్‌ రావు కేసులో మళ్లిd పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేయనున్న నేపథ్యంలో తాజా అరెస్ట్‌, విచారణ రాజకీయ ప్రకంపనలు కలిగిస్తున్నాయి. తమ నేత చుట్టూ ఏదో కుట్ర జరుగుతోందని మధు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరుగుతోంది?
పుట్ట మధు పోలీసుల అదుపులో ఉండడం వెనక కారణాలు ఏంటన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. 2018 ఎన్నికలకు ముందు మంథని మాజీ సర్పంచ్‌ ఇను ముల సతీష్‌ ఉన్నతాధి కారులకు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. వైరల్‌ అయిన ఆడియో రికార్డుల ఆధారంగా కూడా ఆయన్ని ప్రశ్నించే అవకాశాలు ఉందని చెబుతున్నారు. ఇటీవల పోలీసు అధికారులకు అందిన ఓ లేఖ సంచలనంగా మారింది. విచారణలో అది కీలకంగా మారినట్లు చెబుతున్నారు. వామన్‌రావు మర్డర్‌ కేసులో రూ.2 కోట్ల సుపారి చేతులు మారిందన్న లేఖ కు సంబంధించి పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. మర్దర్‌ కేసుకు రెండు, మూడు రోజుల ముందు ఈ డబ్బు డ్రా చేసినట్టు ఇంటలిజెన్స్‌ వర్గాలు కూడా సమాచారం సేకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలపై స్పష్టత కోసం పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే.. మధు అజ్ఞాతవాసం చర్చనీయాంశంగా మారింది. ఎవరి పాత్ర ఏంటి? ఏది నిజం.. ఏది అబద్దం? విచారణలో మరిన్ని కొత్త కోణాలు వెలుగుచూసే అవకాశం ఉందా? అన్న అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
శైలజపై కూడా..
పుట్ట మధు భార్య, మంథని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ శైలజను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. వామన్‌రావు మర్దర్‌ కేసులో నిందితులను ఇటీవల మంథని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆవరణకు వచ్చిన శైలజ, మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో మాట్లాడమే కాకుండా ఆయన శైలజను వేరే ఫోన్‌లో మాట్లాడించారన్న అభియోగంపై మంథని పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ కేసులో శైలజను అరెస్ట్‌ చేయవచ్చన్న ప్రచారాలు జరుగుతన్నాయి. దీంతో తాజా పరిణామాలపై వారి అనుచరుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement