Thursday, April 25, 2024

Safest State – మహిళలకు భరోసానిచ్చిన సర్కారు మాది – మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, జూన్ 4: మహిళలకు అత్యధిక భరోసానిచ్చిన సర్కార్ తమదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక క్రీడలు యువజన సర్వీసులు సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 2014 ముందు కనీసం తాగునీళ్లు లభించక మహిళలు పడిన కష్టాలకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడారని అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతపై శిల్పారామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 1లక్ష సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నామని మంత్రి తెలిపారు.

తమ నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ. 500 కోట్ల బ్యాంకు రుణాలు అందించి మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు సహాయపడ్డామన్నారు. మహా బ్రాండ్ ఏర్పాటుచేసి స్థానిక మహిళా సంఘాల సభ్యులు ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించేందుకు అవకాశం కల్పించామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళా భద్రతకు రక్షణగా నిలుస్తున్నామన్నారు. షీ టీమ్స్ ద్వారా మహిళలపై వేధింపులను అరికడుతున్నామని మంత్రి తెలిపారు.

మహిళా పోలీస్ స్టేషన్లు, కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా మహిళలకు ఒక భరోసాను కల్పిస్తున్నామని అన్నారు. ఇంకా కొన్నిచోట్ల మైనర్ బాలికలకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారని ఈ దురాచారాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళా శక్తి చాలా గొప్పదని మహిళలంతా జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

అంతకుముందు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా… పోలీస్ సురక్ష దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శిల్పారామంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి ప్రారంభించి.. తిలకించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డా సి లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ కె నరసింహ, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జెడ్పి వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్యం జనార్ధన్, డి.ఎస్.పి మహేష్, సీఐ రజిత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement