Friday, March 29, 2024

కరోనా ఫీజు రీఫండ్‌.. రోగుల కుటుంబాలకు చెల్లించిన 44 ఆస్ప‌త్రులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కరోనా విపత్కర పరిస్థితుల్లో పేషెంట్లనుంచి వసూలు చేసిన అధిక ఫీజులను హైదరాబాద్‌లోని 44 ప్రయివేటు, కార్పోరేటు ఆసుపత్రులు తిరిగి చెల్లించాయి. కరోనా కాలంలో కార్పోరేట్‌ ఆసుపత్రి నుంచి చిన్న ప్రయివేటు ఆసుపత్రులు కూడా చికిత్స కోసం వచ్చిన బాధితుల నుంచి లక్షల్లో ఫీజులను వసూలు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో… పెద్ద సంఖ్యలో కరోనా రోగులు ప్రయివేటు, కార్పోరేటు ఆసుపత్రులపై వైద్య, ఆరోగ్యశాఖకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయా ఆసుపత్రులకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది.

నోటీసులు అందుకున్న హైదరాబాద్‌ పరిసరాల్లోని మొత్తం 44 ఆసుపత్రులు ఏకంగా రూ.1.61 కోట్ల మొత్తాన్ని రోగుల కుటుంబాలకు తిరిగి చెల్లించాయి. హైదరాబాద్‌లోని నాలుగు ఆసుపత్రులు ఒక్కొక్కటి రూ.10లక్షలకు పైగా తిరిగి ఇవ్వగా… కూకట్‌పల్లిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రి రోగి కుటుంబ సభ్యులకు మొత్తం రూ.27.41 లక్షలు తిరిగి ఇచ్చి అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ఆర్టీఐలో పిటీషన్‌ వేయగా ఈ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నగరంలోని కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, సచివాలయం, హైటెక్‌ సిటీ, బషీర్‌బాగ్‌, గచ్చిబౌలి, నాగోల్‌ తదిరత ప్రాంతాల్లోని ప్రముఖ ఆసుపత్రులకు రోగులకు కరోనా ఫీజును రీఫండ్‌ చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement