Saturday, April 20, 2024

ఒమ్రికాన్ పై ప్రత్యేక ప్రోటోకాల్ వైద్య, ఆరోగ్యశాఖ ముమ్మర చర్యలు

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: కరోనా ఒమ్రికాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలోకి వచ్చే విదేశీ ప్రయాణికులపై శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తనిఖీలను వైద్య ఆరోగ్యశాఖ ముమ్మరం చేసింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రోటోకాల్‌ను సిద్ధం చేసింది. విదేశీ యాత్రికులపై కేంద్రం విధించిన ఆంక్షలను తెలంగాణలో అమలు చేయనున్నారు.

విదేశీ ప్రయాణికులు కరోనా నెగిటివ్‌ అని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టును తప్పనిసరిగా చూపించాలి… అయినప్పటికీ 14 రోజుల హోం క్వారంటైన్‌ను పాటించాలి. ఒమ్రికాన్‌ వ్యాప్తిలో ఉన్న దేశాల నుంచి వచ్చిన వారైతే ముందుగానే ఎయిర్‌పోర్టు వర్గాలకు సమాచారం అందించాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement