Wednesday, October 27, 2021

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.. 2 గేట్లు ఎత్తివేత

ఎగువన కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చిచేరుతోంది. దీంతో అధికారులు రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేశారు. ఎగువనుంచి 2,20,810 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1.22 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుతం 883.90 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ట నీటినిల్వ 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం 209.1579 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల జలాశయానికి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 2.08 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 28 గేట్లు ఎత్తి 2,09,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుతం 8.048 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఈసారి కూడా ప‌టాకుల‌పై బ్యాన్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News