Wednesday, June 16, 2021

జూ పార్కులో కొమరం భీమ్..

ఏంటీ హైదరాబాద్ జూ పార్క్ లో కొమరం భీమ్ ఉండటమేంటని ఆశ్యర్యపోతున్నారా..? అవును నిజమే కాని అది ఓ బుల్లి ఖడ్గం మృగం. హైదరాబాద్ జూ పార్క్ లో ఓ బుల్లి ఖడ్గ మృగానికి కోమరం భీమ్ గా పేరు పెట్టారు అక్కడి సిబ్బంది. అంతేకాదు దానితో పాటు మరో గౌర్ దూడ కు చోటా భీమ్ అని పేరు పెట్టారు. ఈ రెండు కూడా ఈ మధ్యే జన్మించాయి. వినూత్నంగా ఆలోచించిన జూ పార్కు సిబ్బంది వీటికి ఇలా పేర్లు పెట్టారు. అంతేకాదు ముద్దు ముద్దుగా ఉన్న వీటి ఫోటోలను సోషల్ మీడియాలో ఈ పోస్టు చేశారు జూ సిబ్బంది. ఇప్పుడ ఈ పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News