Tuesday, April 16, 2024

తెరపైకి మళ్లీ హోదా అంశం.. కేంద్రంతో ఏపీ సీఎం ‘ఢీ’?

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ మళ్లీ తెరపైకి తెచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం ఇప్పటికే కేంద్రం పలు సార్లు స్పష్టం చేసింది. అయితే, ఈ విషయంపై ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సీఎం జగన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్తునే ఉన్నారు. అయితే, ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని వైసీపీ ఎంపీలు మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ఏపీకి హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన చేశారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు దూసుకెళ్లారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది. ఇక లోక్ సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

మరోవైపు వైసీపీ అకస్మాత్తుగా హోదా నినాదాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్లగా కేంద్రానికి అన్ని విషయాల్లో ఏపీ ప్రభుత్వం మద్దుతు ఇచ్చింది. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమర్ధిస్తూనే ఉంది. ఇటీవల కరోనా కట్టడిలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ విఫలమైందంటూ విపక్షాలు విరుచుకుపడిన సమయంలోనూ ప్రధాని మోదీకి సీఎం జగన్ మద్దతుగా నిలిచారు. కేంద్రంపై నిందలు వేయోద్దని ఇతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు కూడా రాశారు. దీనిపై పలు రాష్ట్రాల సీఎంల నుంచి జగన్ విమర్శలు కూడా ఎదర్కొన్నారు. ఇటీవల ప్రధాని మోదీతో నిర్వహించిన వర్చువల్ గా నిర్వహించిన సమీక్షలోనూ ప్రధానిని సీఎం జగన్ పొగిడారు. అయితే, ఇప్పుడు పరిస్థితి కేంద్రంతో జగన్ ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ ప్రధాని మోదీకి సరెండర్ అయ్యారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ప్రధానికి తాకట్టు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కేంద్రంపై పోరుకు సిద్ధమైనట్లు సంకేతాన్ని పంపుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందులో భాగంగానే పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే వైసీపీ ఎంపీలు గందరగోళనం సృష్టించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: రైతు వేదికలో టీఆర్ఎస్ నేతల మందు పార్టీ

Advertisement

తాజా వార్తలు

Advertisement