Saturday, April 20, 2024

ఏడేళ్లు గడిచినా.. నిరుద్యోగులకు ఆత్మహత్యలే దిక్కా?

ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లా చేర్యాలలో ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్య చేసుకున్న కొట్టంల వెంకటేష్ కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని అన్నారు. దయచేసి ఎవరు ఆత్మహత్యలకు పాల్పడొద్దు కోరారు. తాను మీ కోసం కొట్లాడుతానని, మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న నిరుద్యోగుల్లో అధిక శాతం తెలంగాణలోనే ఉన్నారని వైఎస్‌ షర్మిల అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో… ఏడెళ్లవుతున్నా యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లక్ష్యాలతో ఉద్యమ చేసి రాష్ట్రం సాధించుకున్నామో.. ప్రస్తుత పరిస్థితులు వాటికి భిన్నంగా ఉన్నాయన్నారు. అమరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని సూచించారు. ఇంకెంత మంది యువత, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారని నిలదీశారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement