Saturday, December 2, 2023

YS Sharmila: రుణమాఫీ చేస్తానని రైతులకు కుచ్చుటోపీ

రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ రైతులకు కుచ్చుటోపీ పెట్టాడని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. గురువారం ప్ర‌జాప్ర‌స్థానంలో పాదయాత్రలో భాగంగా 35వ రోజు యాదాద్రి జిల్లాలోని ఆత్మకూర్ మండ‌లం పారుపల్లి, ఉప్పల్ పహాడ్, టీ రేపాక గ్రామాలలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.5వేలు ఇచ్చి, రైతులకు సంబంధించిన అనేక పథకాలను కేసీఆర్ నిర్వీర్యం చేసాడన్నారు. వ‌డ్డీ లేకుండా మ‌హిళ‌ల‌కు రుణాలు ఇస్తామ‌ని చెప్పారని, నేటి వరకు వడ్డీలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. గ్రామ గ్రామన పాదయాత్రలో ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement