Thursday, April 18, 2024

బిగ్ బాస్ షోతో యువ‌త త‌ప్పుదోవ ప‌డుతోంది- ఏపీ హైకోర్టు

బిగ్ బాస్ షో పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ఏపీ హైకోర్టు. బిగ్ బాస్ త‌ర‌హా షోలు ప్ర‌మాద‌క‌ర‌మైన‌వేన‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఇలాంటి షోల‌తో యువ‌త త‌ప్పుదోవ ప‌డుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.. అభ్యంత‌ర‌క‌ర షోల విష‌యంలో కోర్టుల జోక్యం అవ‌స‌ర‌మ‌ని కూడా హైకోర్టు అభిప్రాయప‌డింది. ఈ మేరకు బిగ్ బాస్ షోల‌పై దాఖ‌లైన ఓ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీకరించాలా.. వ‌ద్దా అనే విష‌యంపై ప‌రిశీల‌న చేసిన సంద‌ర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. బిగ్ బాస్ షోపై దాఖ‌లైన పిటిష‌న్‌పై ఎల్లుండి (సోమ‌వారం) విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు హైకోర్టు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement