Saturday, April 20, 2024

గోల్డెన్ గేట్ బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డిన యువ‌కుడు.. గాలిస్తోన్న అధికారులు

గోల్డెన్ గేట్ బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డ్డాడు భార‌త సంత‌తికి చెందిన యువ‌కుడు..ఈ ఘ‌ట‌న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చోటు చేసుకుంది. వంతెనపై అతని సైకిల్, ఫోన్, బ్యాగ్ లభ్యమయ్యాయని అమెరికా కోస్టల్‌ గార్డ్స్‌ అధికారులు తెలిపారు. పన్నెండో తరగతి చదువుతున్న 16 ఏళ్ల ఇండియన్‌ అమెరికన్‌.. బ్రిడ్జిపై నుంచి దూకాడని చెప్పారు.

వెంటనే తాము గాలింపు చేపట్టామని వెల్లడించారు. గోల్డెన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ భారతీయ అమెరికన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇది నాలుగోసారని ఎన్నారై అజయ్ జైన్ భూటోరియా తెలిపారు. కాగా, 1937లో ప్రారంభమైన ఈ బ్రిడ్జిపై నుంచి ఇప్పటివర‌కు 2 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో గతేడాది 25 మంది ఉన్నారు. అయితే తరచూ ఇక్కడ ఆత్మహత్య కేసులు నమోదవుతుండటంతో వంతెనకు ఇరువైపులా 20 అడుగుల వెడల్పుతో ఇనుప మెష్‌ను నిర్మిస్తోంది అక్క‌డి ప్ర‌భుత్వం.కాగా బాలుడు ప్రాణాలతో ఉండే అవకాశం చాలా తక్కువేనని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement