Thursday, April 25, 2024

ఆరు రోజుల్లో 2కోట్ల మంది యువ‌త‌కి ‘వ్యాక్సిన్’ – మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ‌

క‌రోనా,ఒమిక్రాన్ తో జ‌నం అల్లాడిపోతున్నారు. ఈ నేప‌థ్‌యంలో క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వాలు వేగ‌వంతం చేస్తున్నాయి. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. ఈ మేర‌కు 15నుంచి 18ఏండ్ల‌లోపు వారికి టీకాలు అందిస్తోంది.కేవ‌లం ఆరు రోజుల్లోనే రెండు కోట్ల మందికిపైగా టీనేజర్లు కరోనా టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈనెల 3వ తేదీన 15-18 ఏండ్ల టీనేజర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. దీంతో ఆరోగ్య కార్యకర్తలు విద్యా సంస్థల్లో విస్తృతంగా వ్యాక్సినేషన్‌ చేపట్టారు.

ఈ క్రమంలో ఆరు రోజుల్లోనే 15 నుంచి 18 ఏండ్ల వయస్సున్న 2 కోట్లకుపైగా యువత టీకా తీసుకున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. బుధ‌వారం (జ‌న‌వ‌రి 5న‌) మ‌ధ్యాహ్నం వ‌ర‌కే దేశంలో కోటి మందికిపైగా టీనేజ‌ర్లు తొలి డోస్ వ్యాక్సిన్‌లు తీసుకున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు 15-18 ఏండ్ల ఏజ్ గ్రూప్‌లో అంద‌రికీ కొవాగ్జిన్ టీకాలు మాత్ర‌మే ఇస్తున్నారు. ఈ మ‌ధ్యాహ్నానికి దేశ‌వ్యాప్తంగా కోటి మందికిపైగా టీనేజ‌ర్లు తొలి డోస్ టీకాలు వేయించుకున్నార‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్‌ మాండ‌వీయ వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement