Wednesday, April 24, 2024

21ఏళ్ల‌కు కార్పొరేట‌ర్ … 23 ఏళ్ల‌కే మేయ‌ర్ ….క‌ర్నాట‌క యువ‌తి సంచ‌ల‌నం

బ‌ళ్లారి – త‌ల్లి, ఆమె కుమార్తె ఇద్ద‌రూ మేయ‌ర్ లుగా ప‌ద‌వులుఅధిరోహించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు.. కుమార్తె ఏకంగా 23 ఏళ్ల‌కే ప్ర‌థ‌మ పౌరురాలిగా బాద్య‌త‌లు స్వీక‌రించి ఔరా అనిపించారు… వివ‌రాల‌లోకి వెళితే రాజ‌కీయ కుటుంబానికి చెందిన డి త్రివేణి 18 ఏట‌నే రాజ‌కీయ అరంగేట్రం చేశారు.. 21వ ఏట బ‌ళ్లారి న‌గ‌ర పాల‌క‌సంస్థ కార్పొరేట‌ర్ కాంగ్రెస్ పార్టీ త‌రుపున విజ‌యం సాధించారు.. తాజా ఆమె ఇటీవ‌ల జ‌రిగిన మేయ‌ర్ ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించి అతి పిన్న‌వ‌య‌సులోనే అంటే 23 ఏళ్ల‌కే మేయ‌ర్ గా ఎన్నికై చ‌రిత్ర‌ను తిర‌గ రాశారు..ఆమె తల్లి సుశీలాబాయి కూడా 2019-20 మధ్య బళ్లారి మేయర్‌గా పనిచేశారు. ఫార్మసీలో డిప్లొమా పూర్తిచేసిన త్రివేణి ఏడాది పాటు మేయర్‌గా కొనసాగుతారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. తాను 21 సంవత్సరాలకే కార్పొరేటర్‌గా విజయం సాధించానని, ఇప్పుడు 23 ఏళ్ల వయసులో మేయర్ అయినట్టు చెప్పారు. అందరినీ కలుపుకుంటూ నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. కాగా, డిప్యూటీ మేయర్‌గా బి.జానకి ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement