Friday, March 29, 2024

త‌మ‌న్ కి ‘ప్ర‌భాస్’ ప్ర‌శంస‌లు

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ని మెచ్చుకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ‘రాధేశ్యామ్’ చూసిన తరువాత ప్రభాస్ అభినందనలు తెలియజేశాడట. అంతేకాదు మారుతి దర్శకత్వంలో తాను చేయనున్న ‘రాజా డీలక్స్’ సినిమా సంగీతం బాధ్యతలను తమన్ కి అప్పగించమని చెప్పినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. సలార్’ .. ‘ప్రాజెక్టు K’ తరువాత మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘రాజా డీలక్స్’ చేయనున్నాడనే టాక్ వచ్చింది. అయితే అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ చేయనున్నాడని అంటున్నారు. ప్రభాస్ క్రేజ్ కి తగినట్టుగానే ఈ కథను తీర్చిదిద్దుతూ తన మార్క్ మిస్ కాకుండా మారుతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement