Wednesday, April 24, 2024

UP Elections: గోరఖ్ పూర్ నుంచే సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆసక్తి రేపుతున్నాయి. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ  అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. తాజాగా తొలి జాబితా విడుదల చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేదానిపై సస్పెన్స్ వీడింది.

సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసే స్థానాన్ని కూడా బిజెపి అధిష్టానం ప్రకటించింది. యోగి ఆదిత్యనాథ్ మథుర లేదా ఐడియా నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అయితే అనూహ్యంగా బిజెపి కీలక నిర్ణయం తీసుకుంది. యోగి ఈ సారి గోరఖ్ పూర్ అర్బన్ అసెంబ్లీ నీ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. సీఎం పోటీ చేస్తున్న గోరఖ్ పూర్ అర్బన్ స్థానానికి ఆరో దశలో ఎన్నిక (మార్చి 3) జరగనుంది.

కాగా గతంలో గోరఖ్ పూర్  నుంచి యోగి ఆదిత్యనాథ్ ఎంపీగా గెలుపొందారు. ఆయన అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో గెలిచి తమ అధికారాన్ని కొనసాగించాలని బిజెపి భావిస్తోంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగారు. ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా సైతం త్వరలో యూపీలో ప్రచారం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement