Thursday, March 28, 2024

IMD: తెలంగాణకు ఎల్లో అలెర్ట్​.. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలుంటయ్​!

మధ్యాహ్నం వరకు చెమటలు కక్కేలా కొట్టిన ఎండలతో ఉన్నట్టుండి హైదరాబాద్​ సిటీలో వాతావరణం మారిపోయింది. సాయంత్రం 3 గంటల నుంచి చినుకులతో మొదలై.. ఆ తర్వాత భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచింది. పలు ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ఇక.. బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌ జంక్షన్‌, రాజ్‌భవన్‌ రోడ్‌ తదితర ఏరియాలైతే ట్రాఫిక్​ జామ్తో అతలాకుతలమయ్యాయి. రోడ్ నంబర్ 12 వద్ద ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి హైదరాబాద్ పోలీసులు నిలిచిన నీటిని క్లియర్ చేయడానికి ప్రయత్నించారు. ఇక హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి ప్రాంతంలోని సూరారం ప్రధాన రహదారిపై కూడ పెద్ద ఎత్తన వాహనాలు నిలిచిపోయాయి.

కాగా, ఇవ్వాల (మంగళవారం) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.  అంతేకాకుండా కొన్ని జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ లు కూడా జారీ చేసింది. సెప్టెంబర్ 7వ తేదీ నాటికి తూర్పు-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తదుపరి 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD పేర్కొంది. 

ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం నాటి IMD నివేదిక ప్రకారం సెప్టెంబర్ 8వ తేదీ (గురువారం) హైదరాబాద్​ సిటీ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

నీట మునిగిన బెంగళూరు.. సహాయక చర్యలు ముమ్మరం

- Advertisement -

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో బెంగళూరు సిటీ ఇప్పటికే అల్లాడిపోతోంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశంలోని ‘సిలికాన్ వ్యాలీ’లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. నేలమాళిగలు, ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. నీటి నష్టాన్ని నివారించడానికి ప్రజలు తమ కార్లను తీసివేయవలసి వచ్చింది. వైట్‌ఫీల్డ్ సమీపంలో విద్యుత్ స్తంభానికి తాకడంతో 23 ఏళ్ల యువతి విద్యుదాఘాతానికి గురైంది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మరోవైపు బెంగళూరులోని వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తాము రెండు NDRF బృందాలను మోహరించామని,  SDRF, ఫైర్ సర్వీసెస్ కూడా సహాయక చర్యలు చేపడుతున్నాయని అధికారులు తెలిపారు. BBPM ప్రజలను తరలించడానికి ట్రాక్టర్లను కూడా ఉపయోగిస్తోందని బెంగళూరు అసిస్టెంట్ కమాండెంట్ జె సెంథిల్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement