Friday, May 20, 2022

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ PA ఇంటిపై వైసీపీ నేతల దాడి

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ PA నల్లాడి అర్జున్ రావు ఇంటిపై కోత్తపాలెం వైసిపి నాయకులు దాడి చేశారు. ఇంటికి వెళ్ళి అర్జున్ రావుపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అర్జున్ రావు బంధువు అయిన ఓ మహిళకు గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స అందించారు. అనంతరం నందిగామ పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాల ఫిర్యాదు చేసుకున్నారు. దాడి చేసిన వారు విక్రమ్, త్రినిల్, గిరిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement