Thursday, June 8, 2023

యాదాద్రి లక్ష్మీ న‌ర‌సిం‌హ‌స్వామి బ్రహ్మో‌త్సవాలు ప్రారంభం

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఇవ్వాల ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. శుక్రవారం ఉదయం స్వస్తీ‌వా‌చ‌నంతో ఉత్సవాల‌ను అర్చ‌కులు ప్రారంభించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. వేడుక‌ల్లో ఆల‌య అర్చ‌కులు, ఈవో గీత‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. స్వామి వారిని ద‌ర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. 11 రోజుల పాటు ఈ బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి.

అఖండ జ్యోతి శోభాయాత్ర
ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌ సందర్భంగా హైదరాబాద్ నుండి బయలుదేరిన అఖండ జ్యోతి శోభాయాత్రలో భువనగిరి పట్టణం లక్ష్మీ నరసింహస్వామి డిగ్రీ కాలేజ్ వద్ద జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారి శోభాయాత్రను సాగనంపారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 28న మహా‌కుంభ సంప్రో‌క్షణ ఉన్నం‌దున బాలా‌ల‌యం‌లోనే బ్రహ్మో‌త్సవా‌లకు ఏర్పాట్లు చేశారు. 10న ఎదు‌ర్కోలు, 11న తిరు‌క‌ల్యాణ మహో‌త్సవం, 12న దివ్యవి‌మాన రథో‌త్సవం, 13న మహా పూర్ణా‌హుతి, చక్రతీర్థం కార్యక్రమా‌లను నిర్వహించ‌ను‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement