Thursday, March 28, 2024

పేదలకు చేరిన పెండ్లి కట్నం.. మంత్రి జగదీష్ రెడ్డికి మహిళల నీరాజనం

నిన్నటి ఉద్యమ నేత నేటి అభివృద్ధి సూరీడు స్వయంగా ఇళ్లకే వచ్చి కల్యాణలక్ష్మీ/షాది ముబారక్ చెక్ లు అందచేస్తుంటే అక్కడి మహిళలు పట్టారని సంతోషంతో తబ్బిబులయ్యారు.పేదల ఇండ్లలో జరుగుతున్న పెండ్లిళ్లకు ఆడపడుచు కట్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన /షాదిముబారక్ చెక్ లు నేరుగా తమ చెంతకే చేరుతుండడంతో నారి లోకం సదరు నేతకు నీరాజనం పట్టింది.ఇంటింటికీ కలియ తిరుగుతూ కాలి నడకన బయలు దేరిన అభిమాన నేతకు ఆయా వార్డుల ప్రజలు ముఖ్యంగా మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టడం గురువారం రోజున సూర్యపేట పురపాలక సంఘం పరిధిలో విశేషంగా జనాలను ఆకర్షించింది.

వి వరాలలోకి పోతే సూర్యపేట పురపాలక సంఘం పరిధిలోని 13 వార్డులలోనీ 86 మందికి కళ్యాణాలక్ష్మి/షాదిముబారక్ పధకం కింద మొత్తం 86 లక్షల 1,376 రూపాయలను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంజూరు చేపించారు.లబ్ధిదారులకు ఆ మొత్తాలను చెక్ ల రూపంలో అందించేందుకు అధికారులు కార్యక్రమాన్ని రూపొందించారు.అయితే పేదింట్లో జరిగే పెళ్లిళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కట్నాన్ని గతానికి భిన్నంగా లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి అందించాలని మంత్రి జగదీష్ రెడ్డి సంకల్పించారు.సంకల్పానికి అనుగుణంగా ఉండాలని కాలి నడకన ఆయా కాలనిలలో కలియ తిరుగుతూ, పట్టణ వాసులను పేరు పేరు నా పలకరిస్తూ ఇంటికే చేరి చెక్ లను అందజేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డికి హారతిలిస్తూ నారిలోకం బ్రహ్మరథం పట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement