Friday, March 29, 2024

సూసైడ్ కి య‌త్నించిన మ‌హిళ – కాపాడిన ఎమ్మెల్యే

కుటుంబ క‌ల‌హాల‌తో ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డింది. బ్రిడ్జిపై నుంచి దూకేందుకు సిద్ధ‌మ‌యింది. ఇంత‌లో అటుగా వెళ్ళుతోన్న ఎమ్మెల్యే ముస్త‌ఫా ఆమెను గ‌మ‌నించి కాపాడారు. ఈ సంఘ‌ట‌న గుంటూరు ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. బాధిత మ‌హిళ‌కి న‌చ్చ‌జెప్పి ఆమెకి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు ఎమ్మెల్యే ముస్త‌ఫా. ఆమె తనకు తోబుట్టువుతో సమాన‌మ‌ని.. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆమెకు తన ఫోన్ నంబరు ఇచ్చిన ఎమ్మెల్యే.. ఎప్పుడు ఫోన్ చేసినా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. బాధితురాలికి అన్ని విధాలుగా నచ్చజెప్పారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ముస్తఫా తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ప్ర‌జా ప్ర‌తినిధులు అంటే ఇలాగే ఉండాల‌ని కొనియాడారు స్థానిక ప్ర‌జ‌లు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement