Thursday, December 9, 2021

హుజురాబాద్ ఉపఎన్నిక: నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు నేడే తుది గడువు

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు నేటితో ముగియ‌నున్న‌ది. ప్ర‌స్తుతానికి బ‌రిలో 42 మంది అభ్య‌ర్థులు ఉన్నారు.  ఇందులో ఎంత‌మంది నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకుంటారు అన్న‌ది తెలియాల్సి ఉత్కంఠగా మారింది.  ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు ఉప‌సంహ‌ర‌ణ‌కు స‌మ‌యం ఉన్న‌ది.  పోటీనుంచి త‌ప్పుకునే వారు నేరుగా సంత‌కం పెట్టి నామినేష‌న్‌ను వెన‌క్కి తీసుకోవాలి.  అధికార టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ముగ్గురు ప్రధాన అభ్యర్థులగా బరిలో ఉండగా.. 32 మంది స్వ‌తంత్రులు, 7 మంది ఇత‌ర పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. ఉపఎన్నికలో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల సంఖ్య‌ను బ‌ట్టి ఈవీఎంల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఒక్కో బ్యాలెట్‌లో నోటాతో క‌లిపి 16 మంది అభ్య‌ర్థులను మాత్ర‌మే పొందుప‌ర్చాల్సి ఉంటుంది.  42 మందిలో సగం మంది విత్‌డ్రా చేసుకున్నా, రెండో బ్యాలెట్ ఏర్పాటుకు అవ‌కాశం ఉంటుంది. బ్యాలెట్‌లో అభ్య‌ర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులు త‌ప్ప‌నిస‌రి. స్వ‌తంత్ర అభ్య‌ర్థుల పేర్ల‌తో అక‌క్ష‌రాల క్ర‌మంలో సింబ‌ల్స్ కేటాయింపుకు అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి:  తెలంగాణలో త్వరలో 1,654 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News