Sunday, November 28, 2021

వైన్ షాప్ టెండ‌ర్ల‌లో మ‌హిళ‌ల హ‌వా..ఒకే కుటుంబంలో నాలుగు టెండ‌ర్లు..

వైన్ షాప్ టెండ‌ర్లు అంటే ప‌లువురికి పండ‌గే..ఈ టెండ‌ర్ల‌కోసం ఎగ‌బ‌డుతుంటారు కూడా. మగ‌వారు స‌రేస‌రి అనుకుంటే..ఈ టెండ‌ర్ల‌లో ఈసారి సునామి సృష్టించారు ఆడ‌వారు..అది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. తొమ్మిది టెండర్ లు వేస్తే ఒకే కుటుంబానికి నాలుగు టెండర్లు వచ్చాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ క్యాసారంలో ఓకే కుటుంబానికి చెందిన అత్త, ఇద్దరు కోడళ్ళు, వారి ఆడపడుచులు మొత్తం నలుగురు కలిసి తొమ్మిది టెండర్లు వేశారు. కాగా ఈ టెండర్లలో నలుగురికి నాలుగు టెండర్లు దక్కడం ఆశ్చర్యకరం. ఇక కొంపల్లి లోని కేవీఆర్ ఫంక్షన్ హాల్ లో టెండర్లు తమకే దక్కాయని తెలియడంతో నలుగురు మహిళల ఆనందానికి హ‌ద్దులేకుండా పోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News