Friday, April 19, 2024

జైల్లోనే త‌న ప్రేయ‌సిని పెళ్ళాడ‌నున్న – వికీలీక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు జూలియ‌న్ అసాంజే

త‌న చిర‌కాల ప్రేయ‌సి స్టెల్లా మోరెస్ ను ఆగ్నేయ లండ‌న్ లోని హై సెక్యూరిటీ జైలులో సింపుల్ గా పెళ్ళి చేసుకోనున్నారు వికీలీక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు జూలియన్ అసాంజే.కాగా అసాంజే యుఎస్ అధికారుల వాంటెడ్ లిస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే. వికీలీక్స్ పేరిట U.S. మిలిటరీ రికార్డులు, దౌత్య పరమైన విషయాలను విడుదల చేసిన అంశానికి సంబంధించి 18 counts పై విచారణను ఎదుర్కోవాల్సి ఉందని U.S. అధికారులు తెలిపారు. అయితే వాటిలో తాను ఎటువంటి తప్పు చేయలేదని 50 ఏళ్ల అసాంజే తిరస్కరించారు. అసాంజే 2019 నుండి బెల్మార్ష్ జైలులో ఉన్నాడు. అంతకు ముందు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఏడు సంవత్సరాలు ఉన్నారు. రాయబార కార్యాలయంలో ఉన్న సమయంలో తన న్యాయవాది అయిన మోరెస్ తో అతను ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ సహజీవనానికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మోరెస్.. అసాంజే కంటే వయసులో పదేళ్లు చిన్నది. 2011లో ఆమె అసాంజె న్యాయ బృందంలో పని చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే అసాంజె ఆమెను కలుసుకున్నాడు. ఆ తరువాత 2015 లో వారి సంబంధం ప్రారంభమైంది. ఈ వివాహం రిజిస్ట్రార్ నేతృత్వంలో జరగనుంది. జైలు విజిటింగ్ అవర్స్ లో ఈ పెళ్లి జరుగుతుంది. ఈ జైలులో బ్రిటన్ లోని ఎంతోమంది నోటోరియస్ క్రిమినల్స్ శిక్ష అనుభవించారు. వీరిలో బాల హంతకుడు ఇయాన్ హంట్లీతో సహా పలువురు ఉన్నారు. పెళ్లి సమయంలో మోరిస్ వేసుకునే దుస్తులు, అస్సాంజ్ ధరించే కిల్ట్ లను బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ తయారు చేశాడు. అతను గతంలో అసాంజ్ అప్పగింతకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. అసాంజేను అమెరికాకు అప్పగించే నిర్ణయానికి వ్యతిరేకంగా బ్రిటన్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడానికి ఈ నెలలో అనుమతి నిరాకరించబడింది. అతని అప్పగింతను ఆమోదించడానికి ప్రభుత్వం నుండి ఏ నిర్ణయాన్ని అయినా అతను ఇప్పటికీ సవాలు చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement