Friday, April 19, 2024

భార్యకు బొద్దింకల భయం.. విడాకులకు సిద్ధమైన భర్త

బొద్దింకలంటే ఓ భార్యకు ఉన్న భయం మూడేళ్లలో 18 ఇళ్లు మారేలా చేసింది. చివరకు పరిష్కారం లభించిందా అంటే అదీ లేదు. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త చివరకు విడాకులకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ జంటకు 2017లో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజులకు భార్య వంటగదిలో పెద్దగా కేకలు పెట్టింది. ఏమిటా అని ఆరా తీస్తే.. బొద్దింకలంటే భయమని చెప్పింది. ఇక ఆ గదిలోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. వేరే ఇల్లు మారదామని పట్టుబట్టింది. తప్పక ఇంకో ఇంటికి మారారు. ఈ పరంపర 18 ఇళ్లు మారే వరకు కొనసాగింది.

దీంతో భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త మానసిక వైద్యులకు చూపించాడు. కానీ, వారి సూచనలు, ఔషధాలేవీ ఆ భార్య పట్టించుకోలేదు. అంతేకాకుండా తన భర్త తనను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నాడని ఆరోపించింది. దీంతో విసిగిపోయిన భర్త చేసేదేమీ లేక ఇప్పుడు విడాకులకు సిద్ధమయ్యాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement