Friday, April 26, 2024

Spl Story: ఐఎండీ పూర్ రిపోర్ట్​​​.. లెక్కతప్పుతున్న అంచనాలు, సోషల్​ మీడియాలో పేలుతున్న జోక్స్​!

‘‘వాతవరణ శాఖ ఇవ్వాల వర్షం వస్తుందని వెదర్​ రిపోర్ట్​ ఇస్తే.. ఆ రోజు ఒక్క చుక్క కూడా రాలదు. ఇప్పట్లో వానలు లేవు, పొడి వాతావరణం ఉంటుందని చెప్పినప్పుడు మాత్రం గట్టి వానలు కురుస్తయ్​’’.. ఇట్లా భారత వాతావరణ శాఖ ఇచ్చే అలర్ట్​లు, వెదర్​ రిపోర్టులపై ఇప్పుడు సోషల్​ మీడియాలో జోకులు పేలుతున్నయ్​.. కామెంట్స్​, ట్రోలింగ్స్​తో ఇన్​బాక్స్​ మోతెక్కిపోతోంది. ప్రపంచ దేశాల్లో మనమే బెటర్​ అని కంపేర్​ చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం యూఎస్​, యూరప్​ వంటి దేశాల మాదిరిగా ఎందుకు కచ్చితమైన వెదర్​ రిపోర్టులను ఇవ్వలేకపోతోంది? ఈ మధ్య అమర్​నాథ్​ గుహ దగ్గర జరిగిన క్లౌడ్​ బరస్ట్​ గురించి ముందే ఎందుకు హెచ్చరించలేదు? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేదిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తీరుపై సీరియస్​ కామెంట్స్​ కూడా వస్తున్నాయి.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

భారత వాతావరణ విభాగం (IMD) ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటోంది. రుతుపవనాలు, భారీ వర్షాలను అంచనా వేయడంలో వాతావరణ కేంద్రాలు విఫలమవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. పలు సందర్భాల్లో ఐఎండీ కచ్చితమైన అంచనాలను ఎందుకు వేయలేకపోతోందన్న వాదన వినిపిస్తోంది. యూఎస్​, యూరప్​ వంటి దేశాలతో కంపేర్​ చేస్తే ఇండియా వెదర్​ రిపోర్ట్​ చాలా పూర్​గా ఉంటోంది. దీనికి ఈ 15 రోజుల్లో దేశంలో నెలకొన్న విపరీత పరిస్థితులే కారణంగా చెబుతున్నారు అనలిస్టులు. ఒక డేంజరస్​ సిచ్యుయేషన్​ని కచ్చితంగా అంచనా వేస్తే ప్రజలకు ఎంతో మేలు జరిగేదని, వందలాది మంది ప్రాణాలు కాపాడే చాన్స్​ ఉండేదని అంటున్నారు. దీనికి ఈ మధ్య అమర్​నాథ్​ గుహ వద్ద ఏర్పడ్డ క్లౌడ్​ బరస్ట్​ని ఎగ్జాంపుల్​గా చూపుతున్నారు. అంతేకాకుండా ఢిల్లీకి IMD ప్రత్యేకంగా ఇచ్చిన వాతావరణ అంచనాలు తలకిందులయ్యాయని, దీంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. వాతావరణ శాఖ అనేక ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను అందించినా.. ఇందులో ఒక్కటి కూడా కచ్చితమైన సమాచారం లేదు.

ప్రపంచంలోనే అత్యుత్తమమైన దేశాలతో కంపేర్​ చేస్తున్నప్పుడు ఇండియా కొత్త టెక్నాలజీని ఎందుకు పొందలేకపోతోంది? ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు.. అమర్‌నాథ్ గుహ ప్రాంతంలో మేఘం పేలడం వంటి విపరీత వాతావరణ సంఘటనను వాతావరణ నిపుణులు ఎందుకు అంచనా వేయలేకపోయారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు యావత్​ దేశ ప్రజలను ఆలోచనలో పడేశాయి. అంతేకాకుండా వాతావరణ శాఖ వెలువరించే బులెటిన్​లను ఓ జోక్​గా చెప్పుకునే పరిస్థితులు వచ్చాయి. దీనికి ప్రభుత్వ పెద్దల నుంచి ఎట్లాంటి ఆన్సర్​ వస్తుందో కానీ, IMD స్పష్టంగా చెప్పిన పలు సందర్భాల్లో వారి అంచనాలు ఫెయిల్​ అయ్యాయనే చెప్పవచ్చు.

- Advertisement -

ఇక.. ఓ మీడియా సంస్థ డేటా ఇంటెలిజెన్స్ యూనిట్ (DIU) 20 ఏండ్ల నాటి డేటాని అనలైజ్​ చేసింది. దీన్ని పరిశీలించినప్పుడు చాలా సంవత్సరాల్లో ఐఎండీ వెలువరించిన రుతుపవనాల అంచనాలు తప్పుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. గత 5 సంవత్సరాల్లో IMD అంచనాలు స్వల్పంగా మెరుగుపడినప్పటికీ ఇంకా బెటర్​మెంట్​ అవసరమి డేటా సూచిస్తుంది. ఐరోపా, యుఎస్‌ మాదిరిగా భారతదేశం ఎందుకు కచ్చితంగా వెదర్​ని అంచనా వేయడం లేదన్న ప్రశ్నలకు పలువురు నిపుణులు ఏమంటున్నారంటే..

కచ్చితంగా అంచనా వేయకపోవడానికి కారణమేంటి?

వాతావరణ అంచనా నమూనాలు అత్యంత ప్రత్యేకమైన పరికరాల ద్వారా సేకరించిన డేటాపై ఆధారపడి ఉంటాయి. వాతావరణ పరిణామాలను అంచనా వేయడానికి డాప్లర్ రాడార్లు, ఉపగ్రహ డేటా, రేడియోసోండెస్, ఉపరితల పరిశీలన కేంద్రాలు, కంప్యూటింగ్ సాధనాలు.. ఇట్లా ఎన్నో లేటెస్ట్​ వెదర్​ ప్రాసెసింగ్ సిస్టమ్‌లు వంటి డిఫరెంట్​ సిస్టమ్స్​ అవసరం. వీటిలో కొంత కావల్సిన ఎక్విప్​మెంట్స్ భారత్​లో​ ఉన్నా.. ఇంకా ఐరోపా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా వెనుకబడి ఉంది.

ప్రస్తుతం దేశంలో 34 రాడార్లు మాత్రమే ఉన్నాయని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. ఈ ఐదేళ్లలో వీటి సంఖ్య కేవలం ఆరు మాత్రమే పెరిగింది. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) దాదాపు 200 డాప్లర్ రాడార్‌లతో వాతావరణ అంచనాలను సేకరించి కచ్చితమైన సూచనలు చేస్తుంది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) అధికారిక వెబ్‌సైట్​లో తెలిపిన ప్రకారం అమెరికాలో 159 డాప్లర్ రాడార్లు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ, ప్రపంచంలోనే తుఫాను అంచనాలో భారత్​ అత్యుత్తమంగా ఉందని IMD యొక్క సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ R K జెనామణి చెప్పారు. డేటా కంప్యూటేషన్ పరంగా జపాన్, చైనా, యూరప్, US కంటే భారత్​ ఐదో స్థానంలో ఉందన్నారు.

గ్రౌండ్ నెట్‌వర్కింగ్ చాలా పూర్​..

అయితే.. మంచి నాణ్యత గల డేటాను పొందడానికి దేశవ్యాప్తంగా మెషిన్‌లు, స్టేషన్‌ల నుంచి కావాల్సిన నెట్‌వర్క్ అవసరం. విపరీతమైన వాతావరణ పరిణామాలకు కీలకమైన ప్రాంతాల్లో డేటా సేకరణ యంత్రాలు అవసరం. గత వారం జమ్మూ, కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహలో మేఘాలు కమ్ముకున్నాయి. అయితే వర్షాకాలంలో ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రికులు సందర్శించే పుణ్యక్షేత్రానికి స్థానికంగా వాతావరణ పరిణామాలను అంచనా వేయడానికి స్థానిక రాడార్ వ్యవస్థ లేదని కొంతమంది వాతావరణ నిపుణులు అంటున్నారు. జమ్మూ, శ్రీనగర్, కుఫ్రి వంటి ప్రదేశాల్లో రాడార్లు ఉన్నాయి. కానీ, అమర్‌నాథ్ లేదా కులు వంటి ప్రదేశాల్లో ఎట్లాంటి రాడార్ వ్యవస్థ లేదు. ఇప్పుడు రాడార్ వ్యవస్థ చాలా అభివృద్ధి చెందింది. అలాంటి ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న లోకల్​ రాడార్‌లను ఏర్పాటు చేయవచ్చు అని స్కైమెట్ కు చెందిన JP శర్మ తెలిపారు.

అయితే.. తమకు అన్ని చోట్లా మంచి వర్కింగ్ సిస్టమ్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంటున్నప్పటికీ ముంబైలో 4 రాడార్‌లలో 2, హైదరాబాద్‌లో ఒకటి, భుజ్‌లో మరొకటి సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా బెంగళూరుతో పాటు చాలా క్లిష్టమైన పరిస్థితులుండే అండమాన్ వంటి పెద్ద సిటీస్​లో కూడా రాడార్ కవరేజ్ లేదు. ఇక్కడ నుండి అనేక తుఫానులు వస్తుంటాయి. ఇందుకోసం నికోబార్ ద్వీపంలో డాప్లర్ రాడార్‌ను ఏర్పాటు చేయాలని 20 ఏళ్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఒక్క ఢిల్లీలోనే మూడు రాడార్లు ఉన్నాయి. న్యూయార్క్ లేదా హాంకాంగ్ వంటి నగరాలు మినహా మూడు రాడార్లు ఉన్న సిటీ ఏదైనా ఉంటే చెప్పండి అని IMD సీనియర్ శాస్త్రవేత్త R K జెనామణి సవాల్​ చేస్తున్నారు. వాతావరణ పరిణామాలను అంచనా వేయడానికి తమ వద్ద రేడియో మీటర్లు, బెలూన్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

ఇక.. రాడార్ల సంఖ్యను పెంచబోతున్నాం. 2025 నాటికి దేశంలోని మొత్తం రాడార్‌ల సంఖ్య 65కి చేరుకుంటుంది. రానున్న కొన్నేళ్లలో పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మరో 4 రాడార్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈశాన్య ప్రాంతంలో 10, ఉత్తర భారతదేశంలోని మైదానాలలో 11 అదనపు రాడార్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం అని ఐఎండీ డీజీ మహపాత్ర తెలిపారు.

హైదరాబాద్​లో పనిచేయని రాడార్​

IMD కి పబ్లిక్ ఇంటర్‌ఫేస్ లేదు..

గత 5 సంవత్సరాల్లో IMD ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. మానవశక్తి పెరిగింది. ఈ నగరాల్లో వాతావరణ పరిణామాలను అంచనా వేయడానికి అనేక కొత్త వాతావరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇంతకుముందు ఢిల్లీకి సఫ్దర్‌జంగ్, పాలం వద్ద రెండు రాడార్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దులో ఉన్న ఔటర్ ఢిల్లీలోని అయా నగర్‌లో మరో రాడార్ ఏర్పాటయ్యింది. ఈ రాడార్‌ల పంపిణీ తూర్పు, ఉత్తర ఢిల్లీ వంటి విభిన్న ప్రాంతాలకు సమానంగా లేదు. ఇవి వేర్వేరు ముఖ్యమైన ప్రాంతాలను కలిగి ఉన్నాయి. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో గణనీయమైన డేటా గ్యాప్ కారణంగా ఢిల్లీలో వాతావరణ అంచనాలు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నామని, అందుకనే ఇటీవలి డేటాలో సమస్య తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు.

IMDకి బడ్జెట్ కేటాయింపులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి.. IMD పని చేసే భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ యొక్క బడ్జెట్ పత్రాలు బడ్జెట్ కేటాయింపులో స్థిరమైన పెరుగుదల ఉన్నట్లు చూపుతున్నాయి. అట్మాస్పియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ – మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ACROSS) కింద మంత్రిత్వ శాఖ 2020-21లో రూ. 217.84 కోట్ల మొత్తాన్ని అందించింది. 2021-22లో సవరించిన అంచనాలు రూ. 339 కోట్లు.. 2022-23లో మరింత పెంచారు. రూ. 460 కోట్ల నిధిని కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement