Saturday, April 20, 2024

TS: మునుగోడు ఓటర్లు ఎటువైపున్నరు.. థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ సంస్థ సర్వేలో ఏం వచ్చింది?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశ రాజకీయాలను ఆకర్షిస్తున్న మునుగోడు ఉపఎన్నికలో ఓటర్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీకే అనుకూల తీర్పును ఇవ్వనున్నట్లు తాము నిర్వహించిన సర్వేలో స్పష్టమైందని థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ సంస్థ ప్రకటించింది. ఈ నెల 17న మునుగోడు నియోజకవర్గంలోని 200 బూత్‌ల పరిధిలో సర్వే నిర్వహించినట్లు సంస్థ ఛైర్మన్‌ ఎం.నాగన్న తెలిపారు. సర్వే ఫలితాలను బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులకు వివరించారు.

ఉప ఎన్నికలో ఏ పార్టీ అభ్యర్తికి ఓటు వేద్దామనుకుంటారన్న అంశాన్ని ప్రస్తావించగా దాదాపు 43.66శాతం మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేయనున్నట్లు చెప్పారని, ఆ తర్వాత 32.39శాతం మంది బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి, 15.96శాతం మంది కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి, 3.333శాతం మంది బీఎస్పీ అభ్యర్థికి, 1.16శాతం మంది స్వతంత్య్ర అభ్యర్థులకు ఓటు వేస్తామని చెప్పారని వెల్లడించారు. ఎటు తేల్చుకోలేని వారు 3.50శాతం మంది ఉన్నారని ప్రకటించారు.

సర్వేలో భాగంగా 7.7శాతం మంది ఓసీలను, 64.1శాతం బీసీలను, 20.7శాతం ఎస్సీలను, 4.7శాతం ఎస్టీలను, 2.8శాతం ముస్లింలను కలిసి ఎవరికి ఓటు వేస్తారని అడగ్గా..బీసీల్లో 43.80శాతం, ఓసీల్లో 41.24శాతం, ఎస్సీలో 44.16శాతం, ఎస్టీల్లో 43.64శాతం, మైనారిటీలు 57శాతం మేర టీఆర్‌ఎస్‌కు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఓసీల్లో బీజేపీకి 31.39శాతం, కాంగ్రెస్‌కు 17.52శాతం, బీసీల్లో 34.85శాతం మంది బీజేపీకి, 15.44శాతం మంది కాంగ్రెస్‌కు, ఎస్సీల్లో 26.64శాతం మంది బీజేపీకి, 15.81శాతం మంది కాంగ్రెస్‌కు, మైనారిటీల్లో 9శాతం మంది బీజేపీకి, 25శాతం మంది కాంగ్రెస్‌కు ఓటువేస్తామని చెప్పినట్లు వివరించారు.

- Advertisement -

పురుషులను సర్వే చేయగా అందులో 43.17శాతం మంది టీఆర్‌ఎస్‌కు, 33.42శాతం మంది బీజేపీకి, 15.39శాతం మంది కాంగ్రెస్‌కు ఓటు వేయనున్నట్లు తేలిందన్నారు. అదేవిధంగా మహిళా ఓటర్లలో 45.09శాతం మంది టీఆర్‌ఎస్‌కు, 29.81శాతం మంది బీజేపీకి, 18.5శాతం మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని తేల్చామన్నారు.

18-25 వయస్సు ఉన్న యువకుల్లో 37.94శాతం టీఆర్‌ఎస్‌కు 37.30శాతం బీజేపీకి, 15.83శాతం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండగా 26-35 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 44.47శాతం మంది టీఆర్‌ఎస్‌కు 32శాతం మంది బీజేపీకి, 15.76శాతం మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు తేలిందన్నారు. ఇక 46ఏళ్ల పైబడిన ఓటర్లు 13.57శాతం వీరిలో 51.35శాతం మంది టీఆర్‌ఎస్‌కు, 26.92శాతం మంది బీజేపీకి, 14.91శాతం మంది కాంగ్రెస్‌కు ఓటు వేయనున్నట్లు చెప్పారని తెలిపారు.

చౌటుప్పల్‌ మండలంలో 43.04 టీఆర్‌ఎస్‌కు, 33.33 శాతం ఓట్లు బీజేపనీకి, 13.64శాతం ఓట్లు కాంగ్రెస్‌కు, నారాయణపురం మండలంలో 37.56శాతం టీఆర్‌ఎస్‌కు, 29.58శాతం బీజేపీకి, 14.08శాతం కాంగ్రెస్‌కు, మునుగోడులో 44.13శాతం టీఆర్‌ఎస్‌కు, 27.58శాతం బీజేపీకి, 17.80శాతం కాంగ్రెస్‌కు , నాంపల్లిలో 34.88శాతం టీఆర్‌ఎస్‌కు, 31.78శాతం బీజేపీకి, 25.58శాతం కాంగ్రెస్‌కు, మర్రిగూడలో 47.55శాతం టీఆర్‌ఎస్‌కు, 35.85శాతం బీజేపీకి, 12.45శాతం కాంగ్రెస్‌కు, చండూరులో 48.25శాతం టీఆర్‌ఎస్‌కు, 26.80శాతం బీజేపీకి, 16.91శాతం ఓట్లు కాంగ్రెస్‌కు పడనున్నాయని వివరించారు. గట్టుప్పల్‌లో 41.31శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి, 32.93శాతం ఓట్లు బీజేపీ అభ్యర్థికి, 11.98శాతం ఓట్లు కాంగ్రెస్‌ అభ్యర్థికి పడనున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement