Saturday, April 20, 2024

Smart Update | వాట్సాప్​లో కొత్త ఫీచర్​.. త్వరలోనే వాయిస్​ మెస్సేజ్​ ట్రాన్స్​స్ర్కిప్ట్ ఆప్షన్​ ​

మెస్సెంజర్​ సర్వీస్​ అయిన వాట్సాప్​ నిరంతరం కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేలా ఈ ఫీచర్లు ఉంటున్నాయి. ఇప్పటికైతే గ్రూపుల్లో వెయ్యిమంది మెంబర్స్​ని జాయిన్​ చేసుకునే వెసులుబాటు కల్పించిన వాట్సాప్​ సంస్థ.. త్వరలోనే మరో కొత్త ఫీచర్​ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వాట్సాప్ వినియోగదారులకు గుడ్​ న్యూస్​.. వాట్సాప్​లో వాయిస్ మెసేజ్ ట్రాన్‌స్క్రిప్ట్స్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాయిస్ నోట్‌ని వినలేని పరిస్థితిలో ఉన్న వారు.. ఈ ఫీచర్ ద్వారా కంటెంట్​ని యాక్సెస్​ చేయవచ్చు. వినియోగదారుని వాయిస్ సందేశాల కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి ఈ ఫీచర్​ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

అయితే.. ఇప్పటికే కొంతమంది బీటా వర్షన్​ వాడుతున్న యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చినట్టు వాట్సాప్​ తెలిపింది. రాబోయే కొన్ని రోజుల్లో ఈ ఫీచర్​ని అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు వాట్సాప్​ వెల్లడించింది. కాగా, ప్రస్తుతానికి ఈ ఫంక్షనాలిటీని ఉపయోగించడానికి యాప్‌లో iOS 23.9.0.70 అప్‌డేట్ కోసం WhatsApp బీటా వర్షన్​ కావాల్సి ఉంటుంది. అయితే.. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ యాక్సెస్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇక.. వాయిస్ మెసేజ్ ట్రాన్స్ క్రిప్ట్ ఫీచర్‌ని ఉపయోగించ వద్దు అనుకునే యూజర్లు WhatsApp సెట్టింగ్స్​ > చాట్‌> వాయిస్ మెసేజ్ ట్రాన్స్ క్రిప్ట్  అనే ఆప్షన్స్​ని ఓపెన్​ చేసి.. దాన్ని ఆఫ్ చేయవచ్చు. కొన్ని API పరిమితుల కారణంగా, ఈ ఫీచర్ ఆపిల్​ ఫోన్లలో వాడే iOS 16తో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వాట్సాప్​ తెలిపింది. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పాత వెర్షన్‌లతో ఈ ఆప్షన్​ పనిచేయదు. ఎందుకంటే ఇది వాయిస్ మెస్సేజెస్​ని రిమోట్ సర్వర్‌లకు పంపకుండా యూజర్ల ఫోన్​లో స్థానికంగా ప్రాసెస్ చేయడానికి మాత్రమే పర్మిషన్​ ఉంటుంది.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement