Thursday, March 28, 2024

నిరుద్యోగుల‌కు వాట్సాప్ గ్రూప్‌.. ప‌ది రోజుల్లోనే జాబ్‌.. ఈ ఆలోచ‌న అదుర్స్‌ కదా..

చ‌దివిన చ‌దువుల‌కు స‌రైన జాబ్ లేక చాలామంది యువ‌త అస‌హ‌నంతో ఉంటున్నారు. ఏం చేయాలో తెలియ‌క ప్ర‌స్టేష‌న్‌కు గుర‌వుతున్నారు. ఇట్లా నేరాల‌కు అల‌వాటుప‌డుతున్న‌వారు కూడా ఉన్నారు. అయితే క‌ర్నాట‌క‌లో ఓ వ్య‌క్తికి వ‌చ్చిన ఆలోచ‌న ఇప్పుడు అంద‌రినీ ఇంప్రెస్ చేస్తోంది. జాబ్ కావాల‌నుకున్న‌వారు ఆ వాట్సాప్‌కు మెస్సేజ్ చేస్తే 10 రోజుల్లో ఉద్యోగం కంప‌ల్స‌రీ అంటున్నారు.. దీని విష‌యాలేంటో చ‌దివి తెలుసుకుందాం..

డిగ్రీలు, పీజీలు చేసినా ఉద్యోగాలు లభించక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. గత ఏడాది దేశంలో 5.27% నిరుద్యోగం ఉంటే అదిప్పుడు 7.11%కి పెరిగింది. దీంతో క‌ర్నాట‌క రాష్ట్రానికి చెందిన హెచ్‌ఆర్‌ నిపుణుడు అచ్యుతానందను ఈ పరిస్థితి కలవరానికి గురిచేసింది. తనవంతుగా వీలైనంత మందికి జాబ్‌ ఇప్పించాలని నిర్ణయించుకొన్నాడు. అచ్యుతానంద 20 ఏండ్లుగా మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్నాడు. కాలేజీ రోజుల నుంచే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా రోజూ ఎంతోమంది నిరుద్యోగులను చూసేవాడు. వాళ్లంతా పీజీలు, డిగ్రీలూ చేసినవాళ్లే. ఎంతోకొంత నైపుణ్యం ఉన్నవాళ్లే. అయినా, ఉద్యోగాలు లభించక ఇబ్బంది పడటం ఆవేదనకు గురిచేసింది.

తనకు పరిచయం ఉన్న హెచ్‌ఆర్‌ మేనేజర్లు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి కొందరికైనా అవకాశం ఇప్పించాలని భావించాడు అచ్చుతానంద‌. అదే సమయంలో, యువత తమ సమయాన్ని వాట్సాప్‌ వీక్షణలోనే గడుపుతున్న విషయాన్ని గమనించాడు. ఆ వాట్సాప్‌ ద్వారానే సమస్యకు ఓ పరిష్కారం చూపాలనుకొన్నాడు. వెంటనే ‘ఉద్యోగ నిమిత్తం’ వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశాడు.

ఉద్యోగార్థులను వివిధ కంపెనీలతో అనుసంధానించడానికి వీలుగా హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్స్‌నూ గ్రూపులో చేర్చాడు. 50 మంది నిరుద్యోగులతో ఇది ప్రారంభమైంది. పది రోజుల్లోనే ఒకరికి ఉద్యోగం వచ్చింది. మరో పదిరోజులకు మరో ఇద్దరికి, ఆ తర్వాత వారం రోజులకు ఐదుగురికి.. ఇలా రోజురోజుకూ ఉద్యోగ విజేతల సంఖ్య పెరగసాగింది. ఉద్యోగావకాశాల కోసం అన్వేషిస్తున్న యువతకు ఇదొక దిక్సూచిలా మారింది. ఒక వాట్సాప్‌ పోస్ట్‌ జీవితాలనే మార్చేస్తున్నది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement