Friday, April 19, 2024

వాటెన్ ఐడియా.. జామ కాయ‌ల అమ్మ‌కానికి నేచుర‌ల్ క్యారీ బ్యాగ్స్‌

‘‘ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాలి.. ప్లాస్టిక్‌తో ప‌రిస‌రాల‌ను నింపేస్తూ క‌లుషితం చేస్తున్నాం’’ అని మ‌నం అంతా ఉప‌న్యాసాలు దంచుతాం.. వేదిక‌ల మీద.. స‌భ‌ల్లోనూ గంట‌లపాటు మాట్లాడుతాం.. కానీ, చివ‌రికి అమ‌లు చేయ‌డంలో మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోం. కానీ, ఓ రైతు మాత్రం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కాకుండా నేచుర‌ల్‌గా కొబ్బ‌రి ఆకుల‌తో బుట్ట‌లు త‌యారు చేసి.. జామ‌కాయ‌ల అమ్మ‌కానికి వినియోగిస్తున్నాడు. అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ జైశ‌క్తి వారు ఈ ఫొటోని షేర్ చేస్తే.. దాన్ని నారాయ‌ణ‌పేట క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న రీ ట్వీట్ చేశారు.

‘‘పండ్ల కంటే విలువైన ఆలోచ‌న‌.. మ‌నంద‌రం దీన్ని అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. నాట్ టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌.. సె నో టూ ప్లాస్టిక్’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. (#NoToSingleUsePlastic #SayNoToPlastic) ‘‘మ‌రి మ‌నం కూడా మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దామా! ఇవ్వాల్టి నుంచి ప్లాస్టిక్ వినియోగించ‌కుండా ఎంత‌మంది త‌మ నిర్ణ‌యాన్ని పాటిస్తారో ఎవరికి వారే పరిశీలించుకోవాలి..’’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement