Thursday, April 25, 2024

మూడోసారి తండ్రి అయిన జుక‌ర్ బ‌ర్గ్

ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి అయ్యాడు ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్ . ఆయన భార్య ప్రిస్కిలా చాన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఈ జంటకు మూడోసారి కూడా అమ్మాయే పుట్టడం పట్ల జుకర్ బర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. తన కుమార్తె పేరు అరేలియా చాన్ జుకర్ బర్గ్ అని వెల్లడించారు. ‘ప్రపంచంలోకి స్వాగతం అరేలియా చాన్ జూకర్ బర్గ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు కుమార్తెను మురిపెంగా చూస్తున్న ఫోటో షేర్‌ చేశారు.కొత్త ఏడాది సందర్భంగా జుకర్‌బర్గ్‌ తన భార్య ప్రెగ్నెంట్‌ అన్న విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. 2023 ఏడాదిలో తమ జీవితాల్లోకి ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి రాబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంటూ.. తన భార్య ప్రిస్కిలా చాన్‌ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సైతం షేర్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement