Thursday, April 25, 2024

వెడ్డింగ్ వేర్ బ్యాంక్ లో ల‌క్ష‌లు విలువ చేసే డ్రెస్ లు .. ఏం చేస్తారో తెలుసా ..

దుస్తులంటే మ‌హా ఇష్టం ఆడ‌వారికి..అందులోనూ పెళ్ళి దుస్తులంటే మ‌రీను..ఎందుకంటే ఎంతో ఇష్ట‌ప‌డి..అతి ఖ‌రీదైన దుస్తుల‌ని ప్ర‌త్యేకంగా కుట్టించి మ‌రీ వేసుకుంటారు. మ‌రి అలాంటి దుస్తుల‌ను ఎవ‌రికైనా ఇవ్వాల్సి వ‌స్తే..అమ్మో స‌మ‌స్యే లేదు..డ‌బ్బున్న వార‌యితే ఖ‌రీదైన దుస్తులు కొనుక్కోగ‌ల‌రు..కానీ పేద‌వారి మాటేంటి..వారు ఖ‌రీదైన దుస్తులు వేసుకునే ఛాన్సే లేదు..అయితే అలాంటి అవ‌కాశాన్ని క‌లిపిస్తోంది వెడ్డింగ్ వేర్ బ్యాంక్..విన‌డానికి కొత్త‌గా ఉన్నా..ఐడియా మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. ఈ వెడ్డింగ్ వేర్ బ్యాంక్ ఏం చేస్తుందో తెలుసా.. పెళ్లిలో వధూవరులు ధరించడానికి డిజైనర్‌ దుస్తులను కొన్నింటిని ఉచితంగా, మరికొన్నింటిని నామమాత్రపు రుసుముకు అద్దెకు ఇస్తుందీ బ్యాంక్. పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్‌ మగిసిన తరువాత డ్రెస్‌లను వెనక్కి తిరిగిచ్చేయాలి. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో ఉన్న డ్రెస్‌లను వధువులే కాదు వ‌రుడు కూడా వాడుకుంటున్నారు.

ఇక్కడ అద్దెకు ఇచ్చే లెహంగాల ఖరీదు ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. మ‌రి ఈ బ్యాంక్ ను ఎవ‌రు స్థాపించారో తెలుసుకుందాం..నోయిడాకు చెందిన అనూప్‌ ఖన్నా 2017లో ఈ బ్యాంక్‌ను ప్రారంభించింది..ఆమె సొంతంగా ఈ బ్యాంక్ ని నిర్వ‌హిస్తోంది… అనూప్‌ వెడ్డింగ్‌ వేర్‌ బ్యాంక్‌ నిర్వహణతో పాటు రుచికరమైన ఆహారం పెట్టి నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. వాళ్ల ‘గ్రాండ్‌ మదర్స్‌ కిచెన్‌ (దాదీకా రసోయి)’ ద్వారా దేశ విదేశాల్లోని వలసకూలీలకు కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆహారం అందించారు. అంతేగాక పేదలకు నామమాత్రము రుసుము పదిరూపాయలకే మందులు, బట్టలు అందిస్తున్నారు. ఈ సేవలు గుర్తించిన రాష్ట్రపతి భవన్‌ అనూప్‌ను సత్కరించింది. అంతేగాక ‘కౌన్‌ బనేగా కరోర్‌పతి’ షోకు వెళ్లినప్పుడు అనూప్‌ సేవలను అమితామ్‌ బచ్చన్‌ కొనియాడిన సంగ‌తి తెలిసిందే.

తొలిసారి ఈ బ్యాంక్‌కు నిహారిక అనే అమ్మాయి తన 70 వేల రూపాయల వెడ్డింగ్‌ డ్రెస్‌ను విరాళంగా ఇచ్చింది. నిహారిక తన పెళ్లి తరువాత.. ఈ డ్రెస్‌ను ఎవరైనా నిరుపేద అమ్మాయి పెళ్లికి వేసుకోవడానికి ఇవ్వండి అని చెప్పి అనూప్‌ కు ఇచ్చింది. అప్పుడు చుట్టుపక్కల మురికివాడల్లోని అమ్మాయిల పెళ్లిళ్లకు అనూప్ ఆ డ్రెస్‌ను ఇచ్చింది .ఈ విషయం ఆనోటా ఈనోటా మరికొంతమందికి తెలియడంతో బాగా పాపులర్‌ అయ్యింది. వెడ్డింగ్ వేర్ బ్యాంక్‌ గురించి తెలిసిన కొందరు తమ పెళ్లిలో ధరించిన ఖరీదైన దుస్తులను విరాళంగా ఇస్తున్నారు. వీటిలో లక్షరూపాయలు ఖరీదు చేసే డ్రెస్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీనిలో పదిహేను రకాల లెహంగాలు, ఇరవై షేర్వానీలు అద్దెకు లేదా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వీటిలో నచ్చిన రంగు, డిజైన్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. పెళ్లికేగాక నిశ్చితార్థం, దీపావళి, దాండియా నైట్‌ వంటి ఈవెంట్లకు సైతం వీటిని వినియోగిస్తున్నారు.

వెడ్డింగ్‌ బ్యాంక్‌ నుంచి డ్రెస్‌లు తీసుకోవాలంటే…కొన్ని నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే. ఆధార్‌ కార్డు లేదా రేషన్‌ కార్డును హామీగా తీసుకుని డ్రెస్‌ ఇస్తారు. ఒకసారి డ్రెస్‌ తీసుకున్న తరువాత పదిహేను రోజుల వరకు మరో డ్రెస్‌ తీసుకునే అవకాశం ఉండదు. తీసుకున్న డ్రెస్‌ను తిరిగి ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా డ్రైక్లీనింగ్‌ చేసి ఇవ్వాలి. డ్రెస్‌ తీసుకున్న వాళ్లు మాత్రమే వాడుకోవాలే తప్ప వేరే వాళ్లకు ఇవ్వకూడదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోనే గాక..మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లనుంచి కూడా కొందరు తమ వెడ్డింగ్‌ డ్రెస్‌లను విరాళంగా ఇస్తున్నారు. పెళ్లిబట్టలతోపాటు ఇమిటేషన్‌ జ్యూవెలరీ, చెప్పులు, మేకప్‌ యాక్ససరీస్‌ వంటి వాటిని కూడా ఇస్తున్నారు. ఒక మంచి ఆలోచ‌న‌తో ప్రారంభించిన ఈ బ్యాంకుకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

:

Advertisement

తాజా వార్తలు

Advertisement