Saturday, April 20, 2024

వాతావ‌ర‌ణ విశేషాలు …

తెలంగాణ‌లో రెండు రోజులు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం లేద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో త‌మిళ‌నాడులోని స‌ముద్ర‌తీర ప్రాంతాల్లో భారీగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని అధికారులు చెప్పారు. అల్పపీడనం వ‌ల్ల క‌న్యాకుమారి తీరంలో ఉపరితల ఆవర్తనం తోడై త‌మిళ‌నాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివ‌రించారు. అంతేగాక‌, అల్పపీడనం వాయుగుండంగా మారనున్న సమయంలో గంటకు 50 నుంచి 60 కి.మీల వేగంతో గాలులు వీయ‌నున్నాయి. ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. పశ్చిమ వాయవ్య దిశగా కదిలిన అనంత‌రం 48 గంటల్లో బలపడనుంద‌న్నారు. దీంతో ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవ‌కాశాలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement