Thursday, April 18, 2024

వెదర్ అలర్ట్: మరో 10 రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాలల్లో భానుడు శాంతించాడు. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, ఉత్తర బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అధిక పీడన ప్రాంతాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న 10 రోజుల పాటు ఏపీలో అక్కడకక్కడా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇక గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరకోస్తా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఉదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అటు తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement