Tuesday, October 19, 2021

Weather Alart: నేడు, రేపు భారీ వర్షాలు

గులాబ్ తుఫాను తెలంగాణలో బీభత్సం సృష్టిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు వణికి పోయారు. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి దీంతో నగరంలోని చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రాగల రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ హెచ్చరించింది. చాలాచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు, కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
లోతట్టు ప్రాంతాలవారిని, పురాతన కట్టడాలకు సమీపంలో ఉన్నవారిని తరలించేందుకు 30 పునరావాస కేంద్రాలు, 170 మాన్సూన్‌ టీమ్‌లు, 92 స్టాటిస్టిక్స్‌ బృందాలను సిద్ధంచేశారు.

హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి, మూసీ నదిలోకి నీటిని వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని బస్తీలు, కాలనీల ప్రజలను అప్రమత్తం చేశారు. గతంలో తెగిన చెరువుల వద్ద పరిస్థితిని ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News