Thursday, April 25, 2024

వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలుస్తాం.. కేటీఆర్

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, విద్య, వైద్య రంగాల్లో అద్భుతమైన మార్పు తీసుకొచ్చామన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం అవుతారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దమ్ముంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. అమెరికా పర్యటనతో తెలంగాణకు 42వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తీసుకొచ్చామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తన ఉనికిని కోల్పోతుందన్నారు. దేశం అన్ని రంగాల్లో వెనుకబడటానికి బీజేపీనే కారణమన్నారు. మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే అమిత్‌ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్నారు. ఓ వైపు ఒవైసీ తమపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విధానాలు బాగున్నాయంటున్నారు. డీలిమిటేషన్‌పై అన్ని పార్టీలు ఏకం కావాలన్నారు. డీలిమిటేషన్‌ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కేటీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement