Friday, March 29, 2024

నూకలు తింటాం, బీజేపీని దించుతాం.. తెలంగాణ రైతులను అవమానించారు: మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మరోసారి తెలంగాణ రైతులను, ప్రజలను పార్లమెంటు సాక్షిగా అవమానించారని, ఆయన వెంటనే తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి. #హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జె.సురేందర్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డిలతో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అవసరమైతే నూకలు అయినా తింటాం కానీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. ఉగాది తర్వాత ధాన్యం సేకరణ పోరుపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ”మమ్మల్ని అంటే ఏమైనా భరిస్తాం కానీ మా రైతులనంటే పడేది లేదని కేసీఆర్‌ చాలాసార్లు చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే స#హంచేది లేదు. నూకలు తినాలని మా మంత్రులు, ఎంపీలతో హేళనగా మాట్లాడిన పీయూష్‌ ఇపుడు మరోసారి అ#హంకారాన్ని ప్రదర్శించారు. ఆడిటర్‌గా పనిచేసిన పీయూష్‌కు రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయి. అర్థం చేసుకోని వాళ్ళకు ఏం చెబుతామని మాట్లాడిన పీయూష్‌ తన అ#హంకారాన్ని వెళ్లగక్కారు. తెలంగాణకు వచ్చి చూస్తే మా ప్రభుత్వం రైతులకేమి చేస్తుందో గోయెల్‌కు తెలుస్తుంది. రైతులకు 24గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. కాళేశ్వరం మూడున్నరేళ్లలో పూర్తి చేశాం. కేంద్ర మంత్రివి కాబట్టే నిన్ను అడుగుతున్నాం. వ్యాపారిలా మాట్లాడటం సరికాదు. ధమ్కీలు మేము ఇవ్వడం లేదు. మా ప్రజల కోసం మాట్లాడుతున్నాం. అరెస్టులు చేస్తాం.. జైల్లో పెడతాం అని ధమ్కీలు ఎవరు ఇస్తున్నారు. ధమ్కీలు ఇచ్చే సంస్కతి బీజేపీది. తెలంగాణ రైతుల కోసం అడిగితే ధమ్కీ అంటావా. సమైక్య పాలకుల భాషనే పీయూష్‌ గోయెల్‌ ఇపుడు మాట్లాడుతున్నాడు. స్థానిక బీజేపీ నేతలు ప్రతి గింజను కేంద్రం కొంటుంది వరి వేయాలి అన్నారు. గతంలో తెలంగాణకు పైసా ఇవ్వమన్నారు. తెలంగాణ ఇచ్చేందుకు బీడియా సిగరెట్టా అని హేళన చేశారు. అన్నిటినీ ఎదుర్కొని తెలంగాణ సాధించాం. ఎగుమతులకు నిబంధనలు అడ్డంకి అని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఆ అడ్డంకులను ఎందుకు తొలగించలేదు.. ఇన్నేళ్లు ఏం పీకారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం పోయి వ్యయాన్ని రెట్టింపు చేశారు.

అన్ని ధరలను కేంద్రం పెంచింది. తెలంగాణ వాతావరణ పరిస్థితులు వేరు పంజాబ్‌ పరిస్థితులు వేరు. పంజాబ్‌లో వరి విత్తనాలు ఉత్పత్తి చేయమంటే చేస్తారా. దేశంలోని 80శాతం విత్తనాలు తెలంగాణలో ఉత్పత్తి అవుతాయి. తెలంగాణలో ఆపిల్స్‌ పండించమని, కాశ్మీర్‌లో వరి పండించాలని అంటే కుదురుతుందా. బీజేపీది ఎవరి పక్షం. పీయూష్‌ కార్పొరేట్లకు ప్రతినిధిగా వ్యవ#హరిస్తున్నారు. బ్యాంకులు ఎగ్గొట్టిన కార్పొరేట్లకు సంబంధించిన 11 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారు.. తెలంగాణ రైతుల కోసం కొంత మొత్తాన్ని కేటాయించలేరా. బీజేపీ నేతలు తేల్చుకోవాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పీయూష్‌ వైపా. వడ్లు కొంటున్న రైతుల వైపా. బాయిల్డ్‌ రైస్‌పై మెడ మీద కత్తి పెట్టి ఒప్పందం చేసుకున్నారు. బాయిల్డ్‌ రైస్‌పై మెడ మీద కత్తి పెట్టి ఒప్పందం చేసుకున్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేసినట్టే బాయిల్డ్‌ రైస్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకోలేరా. బీజేపీది బెదిరింపు సంస్కృతి. కార్పొరేట్లు ఓటేస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదని పీయూష్‌ గోయల్‌ గ్ర#హంచాలి. వడ్లు కొనకుంటే తెలంగాణ రైతుల కోపాగ్నికి బీజేపీ బలికాక తప్పదు. వ్యవసాయానికి విద్యుత్‌ మీటర్లు పెట్టుకుంటే ఏడాదికి ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం ఆఫర్‌ చేసినా రైతుల కోసం కేసీఆర్‌ తిరస్కరించారు. తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలే ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ కార్పొరేట్ల పార్టీ కాదు. ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ టీఆర్‌ఎస్‌. మాకు అవమానాలు కొత్త కాదు అన్నిటినీ ఎదుర్కొంటాం. రైతుల పక్షాన ఉంటాం” అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

గోయల్‌ వన్నీ అబద్దాలే: పల్లా
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ”కేంద్రం తెలంగాణకు సంబంధించి పార్లమెంటు సాక్షిగా అబద్దాలు చెబుతోంది. కేంద్రానికి కేసీఆర్‌ ధమ్కీ ఇస్తున్నారని గోయల్‌ ఆరోపించారు. గుజరాత్‌ సీఎంగా మోడీ ఉన్నపుడు అప్పటి ప్రభుత్వాన్ని అనేక అంశాల్లో నిలదీశారు. అది ధమ్కీ కాదా. బీజేపీ తన ప్రత్యర్థులను బెదిరిస్తోంది. ప్రత్యక్ష దాడులు చేస్తోంది. ఢిల్లిd సీఎం కేజ్రీవాల్‌ ఇంటిపై సాక్షాత్తూ బీజేపీ ఎంపీ నేతృత్వంలో దాడి జరిగింది. ఎవరిది దాడుల సంస్కృతి. గుజరాత్‌లో రైతులకు నాలుగ్గంటలు కూడా కరెంటు ఇవ్వలేని దుస్థితి. ధాన్యం సేకరణలో రైతుల అకౌంట్లలోకి నేరుగా కేంద్రం డబ్బులు వేస్తామన్నది అబద్ధం. 90శాతం డబ్బులు ముందే వేస్తున్నామని చెప్పడం మరో అబద్ధం. బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఈ నెల 2 తర్వాత ధాన్యం సేకరణపై కార్యాచరణ ప్రకటిస్తాం” అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement