Tuesday, April 23, 2024

ఎనిమిదేళ్లలో 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం : హ‌రీశ్ రావు

తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్లలో 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్‌ రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-లైబ్రరీని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సంగారెడ్డి మెడికల్ కాలేజీని రికార్డ్ సమయంలో 7 నెలల్లోనే పూర్తిచేశామన్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్‌ కిట్లు అందించనున్నామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలో ఎనిమిది మెడికల్‌ కాలేజీ, హాస్పిటళ్లను ప్రారంభించుకున్నామని చెప్పారు.

ఎయిమ్స్‌లో కంటే తెలంగాణలోని మెడికల్‌ కాలేజీల్లో ఎక్కువ సౌకర్యాలు కల్పించామన్నారు. తెలంగాణ రాకముందు 58 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఒక్క 2022 సంవత్సరంలోనే తాము 8 కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి లక్షమందికి 19ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అన్ని మెడికల్ కాలేజీల్లో లైబ్రరీలు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement