Thursday, March 28, 2024

Breaking: తెలంగాణకు హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయ్..

తెలంగాణకు వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించింది.  10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య అదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి 10వ తేదీకల్లా మరింత సమాచారం అందజేయనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement