Thursday, March 28, 2024

బ్లాక్ మార్కెట్‌లో రెమిడెసివర్ ఇంజక్షన్ల.. ముఠా అరెస్ట్

రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. కరోనా వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయాల్లో డాక్టర్లు అందించే రెమ్ డెసివర్ ఇంజక్షన్లను ఎంఆర్‌పీ కన్నా అత్యధిక రెట్లతో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 28 రెమిడెసివర్ ఇంజక్షన్లు, 20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మనోహర్, కుమారస్వామి, అశోక్‌ అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

 కరోనా రోగులను ప్రాణాల నుంచి కాపాడేందుకు ఉపయోగిస్తున్న రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొరతగా సృష్టించి బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు చేస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. రెమిడెసివిర్ ఇంజనక్షన్ల కొరత నేపథ్యంలో  ఆస్పత్రుల వద్ద ఉండే మందులషాపులో పనిచేస్తూ రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరలకు ఇంజక్షన్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఓ ప్రైవేట్ హస్పిటల్ లో మందుదుకాణాన్ని నిర్వహిస్తున్నఈ ముఠా సభ్యులు హెటీరో ఫార్మ కంపెనీ నుండి రెమ్ డెసివర్ ఇంజక్షన్లను ఒక్కోటి రూ. 2,800 చోప్పున కోనుగోలు చేసి  వ్యాధిగ్రస్తులకు రూ. 3,490/- అమ్మాల్సి ఉంటుంది. కాని ప్రస్తుతం రెమిడెసివర్ ఇంజక్షన్లను  మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో సంబంధిత ఆస్పత్రులు, ఫార్మసీ యాజమాన్యం, కరోనా బాధితులకు రూ. 35 వేల నుండి 45వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని సీపీ తరుణ్ జోషి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement