Wednesday, December 1, 2021

విజన్ ఆన్ వీల్స్.. స్కూల్ చిల్డ్రెన్స్‌కి కంటి ప‌రీక్ష‌లు..

ప్ర‌భ‌న్యూస్ : కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల వాడకం వల్ల పిల్లల్లో కంటి చూపు సమస్యలు తలెత్తుతున్నాయని ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు, పద్మశ్రీ గ్రహిత డా.మహి పాల్‌ ఎస్‌.సచ్‌దేవ్‌ అన్నారు. చైనా, తైవాన్‌, కొరియా వంటి దేశాల్లోని చిన్నారుల్లో సగం కంటే ఎక్కువ మంది దృష్టిలోపాలతో బాధపడుతున్నారని తెలిపారు. ఢిల్లిలో ‘విజన్‌ ఆన్‌ వీల్స్‌’ సదుపాయాన్ని తన సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ సైట్‌’ ద్వారా ప్రారంభించిన ఆయన, చిన్నారుల్లో పెరుగుతున్న దృష్టిలోపాల గురించి వివరించారు. డిజిటల్‌ యుగంలో, కరోనా అనంతర పరిస్థితుల్లో మయోపియా (హ్ర‌స్వదృష్టి) బారిన పడుతున్న పిల్లల సంఖ్య బాగా పెరుగుతోందని, భారత్‌లో స్కూలుకు వెళ్తున్న పిల్లల్లో కనీసం 25శాతం మందికి దృష్టిలోపా లున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దృష్టిలోపంతో బాధపడే పిల్లలు చదువులో, క్రీడల్లో వెనుకబడిపోతారని డా.సచ్‌దేవ్‌ అన్నారు.

కంటి ఆరోగ్యాన్ని పరీక్షించే వివిధ రకాల పరీక్షలను ఇంటికే వచ్చి పరీక్షించేలా తాము విజన్‌ ఆన్‌ వీల్స్‌ సదుపాయాన్ని ప్రారంభించినట్టు ఆయన తెలి పారు. రూ. 199 ఖర్చుతోనే ఇంట్లోనే ఉండి కంటి పరీక్షలు చేయించుకోవచ్చని చెప్పారు. అదే సమయంలో తమ సీఎఫ్‌ఎస్‌-విజన్‌ స్టోర్లు, ఐకేర్‌ సెంటర్లను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 3, విజయవాడలో ఒక సెంటర్‌ ప్రారంభించామని తెలిపారు. మెరుగైన కంటి వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తే తాము తెలుగు రాష్ట్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప త్రులు నెల కొల్పుతామని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రికి కంటి వైద్యం అందించి తెలుగు రాష్ట్రాల్లోనూ పేరుగాంచిన డా.సచ్‌దేవ్‌, దక్షిణాది రాష్ట్రాల్లో తమ సంస్థను మరింతగా విస్తరిస్తామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News