Friday, April 19, 2024

Virus: కేరళలో మరో కొత్త వైరస్​.. సోకిన కొద్ది రోజులకే చనిపోతున్న స్ట్రీట్ డాగ్స్‌..

కరోనా వైరస్ మహమ్మారి భయం నుంచి జనం ఇంకా పూర్తిగా తేరుకోలేదు. కేరళలో మరో కొత్త వైరస్​ వెలుగలోకి వచ్చింది. ఇప్పుడీ వ్యాధితో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కోవలంలో ఈ వ్యాధి కలకలం రేపుతోంది.

పెంపుడుశునకాలు వరుసగా చనిపోతుండడంతో కేరళ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రెండు వారాల వ్యవధిలో 20కి పైగా వీధి కుక్కలు చనిపోగా, వాటి మరణానికి కారణమైన వ్యాధి ఏంటన్నది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.

కాగా, ఈ వ్యాధికి గురైన శునకాలు చనిపోయే ముందు వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడినట్టు గుర్తించారు స్థానికులు. ఈ లక్షణాలు కనిపించిన రెండు రోజుల్లోనే కుక్కలు చనిపోయాయని చెబుతున్నారు.

దీనిపై పశు సంవర్ధకశాఖ అధికారులు స్పందించారు. గాల్లో వ్యాపించే ఓ వైరస్ కారణంగానే శునకాలు చనిపోతున్నట్టు అనుమానిస్తున్నారు. బహుశా ఇది కెనైన్ డిస్టెంపర్ అనే జబ్బు అయ్యుంటుందని, ఇది వైరస్ కారణంగా సోకుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ వైరస్ కుక్కల నుంచి మనుషులకు సోకినట్టు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement