Thursday, April 25, 2024

స‌మంత సాంగ్ కి – కోహ్లీ స్టెప్పులు-వైర‌ల్ గా వీడియో

హీరోయిన్ స‌మంత సాంగ్ కి డ్యాన్స్ చేశాడు క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ.. ఆర్ సి బి ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్, విని రామన్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే..కాగా వీరి వివాహం జరిగి ఒక నెల పూర్తి అయిన సందర్భంగా..రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ బయోబబుల్ లో ఈ జంట కోసం ప్రత్యేక వేడుకను నిర్వహించింది.చాలామంది ఆర్ సి బి ప్లేయర్స్ తమ సోషల్ మీడియా ద్వారా ఈ ఫంక్షన్ లో పాల్గొన్న చిత్రాలను షేర్ చేశారు.భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి పార్టీని ఆస్వాదించారు.టాలీవుడ్ హీరోయిన్ సమంత డాన్స్ చేసిన ” ఊ అంటావా మామ” పాటకు ఆర్సిబి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టెప్పులు వేశాడు.
కోహ్లీ డాన్స్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement