Wednesday, March 27, 2024

షర్ట్ విప్పి జిమ్ లో చెమటోడుస్తున్న విరాట్ కోహ్లీ.. వీడియో పోస్ట్ చేసిన క్రికెటర్

జిమ్ లో చెమటోడుస్తూ ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టాడు విరాట్ కోహ్లీ. జిమ్‌ సెషన్ లో పాల్గొన్న వీడియోను విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. త్రెడ్‌మిల్‌పై పరిగెడుతూ.. చొక్కా విప్పి బరువులను లాగుతున్న దృశ్యాలను కోహ్లి తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోకు కోహ్లి ఫ్యాన్స్ ఇంప్రెస్ అయిపోయారు. కోహ్లి సహచరుడు సూర్యకుమార్ యాదవ్ అయితే చిరుత ఎమోజీని పోస్టు చేసి మాజీ కెప్టెన్‌ను చిరుతతో పోల్చాడు. ఇటీవలి కాలంలో కోహ్లి, సూర్య మధ్య సోషల్ మీడియాలో బ్రొమాన్స్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో సూర్య మెరుపు శతకం బాదిన తర్వాత.. వీడియో గేమ్ ఇన్నింగ్స్ అంటూ మిస్టర్ 360 ఆటతీరును కోహ్లి ప్రశంసించాడు. కండలు తిరిగే దేహాన్ని సొంతం చేసుకున్న కోహ్లి.. శాకాహారి కావడం గమనార్హం. ఒకప్పుడు బటర్ చికెన్‌ను ఇష్టంగా తిన్న విరాట్.. నాన్ వెజ్ మానేశాక కూరగాయలను ఎక్కువగా తీసుకుంటున్నాడు. తాను గుడ్లు, రెండు కప్పుల కాఫీ, క్వినోవా, స్పినాచ్‌తోపాటు దోసెలను కూడా ఆహారంగా తీసుకుంటున్నానని.. కాకపోతే మితంగా తింటున్నానని విరాట్ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement