Sunday, March 26, 2023

విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త – ఇన్ స్టా గ్రామ్ 20కోట్ల మంది ఫాలోవ‌ర్స్

క్రికెట‌ర్ విరాట్ కోహ్లీని ఇన్ స్టాగ్రామ్ లో 20కోట్ల మంది ఫాలో అవుతున్నార‌ట‌. ఈ ఘ‌న‌త‌ని సాధించిన తొలి భార‌తీయుడు కోహ్లీనే కావ‌డం విశేషం. క్రీడారంగానికి చెందిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు లియోన‌ల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డోలు మాత్ర‌మే కోహ్లీ క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఫాలోవ‌ర్లు క‌లిగి ఉన్నారు. కొత్త మైలురాయి చేరుకున్న సంద‌ర్భంగా కోహ్లీ త‌న ఇన్‌స్టా స‌పోర్ట‌ర్ల‌కు థ్యాంక్స్ తెలిపారు. ఇటీవ‌ల టీ20 వ‌రల్డ్‌క‌ప్ త‌ర్వాత టీ20 సార‌థ్య బాధ్య‌త‌ల‌ను కోహ్లీ వ‌దులుకున్న విష‌యం తెలిసందే. ఇక వ‌న్డేల‌కు అత‌న్ని కెప్టెన్సీ నుంచి త‌ప్పించారు. స్వ‌యంగా టెస్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డంతో.. అత‌ని స్థానంలో అన్ని ఫార్మాట్ల‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement