Wednesday, April 17, 2024

వైరల్: హైదరాబాద్‌లో కనువిందు చేసిన సూర్యుడు

హైదరాబాద్ నగరంలో ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో సూర్యుడిని కప్పేస్తూ ఇంద్రధనుస్సు తరహాలో రంగులు కనిపించాయి. దీంతో ఈ దృశ్యం నగర వాసులను ఆశ్చర్యచకితులను చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు తీసి పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సూర్యుడు ఈ విధంగా కనిపించడాన్ని 22 డిగ్రీల హాలో అంటారని పలువురు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూర్యుడు చాలా రేర్‌గా ఇలా కనిపిస్తాడని అంటున్నారు. ఇది కాంతిని చెదరగొట్టడం వల్ల ఏర్పడే అవకాశం ఉందని, కాంతి యొక్క వృత్తాకారంలో సూర్యుడు లేదా చంద్రుడు చుట్టూ కనిపిస్తుందంటారు. కాగా ఇటీవల బెంగళూరులోని సూర్యుడు ఇదే తరహాలో కనిపించాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో సూర్యుడు వింతగా కనిపించడంతో పలువురు తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు.

కాగా సూర్యుడు చుట్టూ వలయాకారం ఏర్పడటం అశుభమంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను నమ్మొద్దని హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement