Thursday, September 21, 2023

Violence – మ‌ణిపూర్ లో కొన‌సాగుతున్న అల్ల‌ర్లు – మ‌రో ఐదుగురు మృతి

మణిపూర్‌లో మరోమారు హింస చెలరేగింది. కేంద్రమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన రానున్న ఈ నేపథ్యంలో రోమారు అల్లర్లు రేకెత్తాయి. ఈ ఘటనలో ఓ పోలీసు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో మృతి చెందినవారి సంఖ్య 80కి పెరిగింది. కాగా, మణిపూర్‌లో జర్వేషన్ తెచ్చిన వివాదం గత నెల రోజులుగా ఆ రాష్ట్రంలో అల్లర్లకు కారణం అయింది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ బంద్ చేసిన విషయం తెలిసిందే. అలాగే నాలుగు రోజుల్లో 40 మంది సాయుధ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.. దీంతో మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈ హింసలో ఒక పోలీసు సహా మొత్తం ఐదుగురు మరణించారు. అలాగే మరో 12 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement