Thursday, April 25, 2024

రేపే విక్ర‌మ్ ఫ‌స్ట్ సింగిల్

ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం విక్ర‌మ్. ఈ చిత్రంలో హీరోగా స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రం త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కానుంది.కాగా మే 11న విక్ర‌మ్ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. గ‌తేడాది విడుద‌లైన టైటిల్ టీజ‌ర్ నుంచి ఇటీవ‌లే విడుద‌లైన మేకింగ్ గ్లింప్స్ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌టి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 3న విడుద‌ల కానుంది. అనిరుధ్ రవిచంద్ర‌న్ సంగీతం అందించిన ఈ పాట‌ను క‌మ‌ల్ హాస‌న్ పాట పాడ‌ట‌మే కాకుండా సాహిత్యాన్ని కూడా అందించారు. ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో మొద‌టి నుంచి భారీ స్థాయిలో అంచ‌నాల‌ను నెల‌కొన్నాయి. ఫాహ‌ద్ ఫాజిల్, విజ‌య్ సేతుప‌తి వంటి స్టార్ హీరోలు ఈ చిత్రంలో న‌టించ‌నుడంటంతో ప్రేక్ష‌కుల‌లోనే కాదు సినీ ప్రముఖులలో కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇటీవ‌లే ఈ సినిమా నాన్‌-థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ.125కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. క‌మ‌ల్ హ‌స‌న్‌కు 232వ సినిమాగా తెర‌కెక్కిన‌ ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌. మ‌హేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ హాస‌న్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement