Friday, April 19, 2024

మార్చిలో రానున్న ‘విక్రమ్’​.. వెరైటీ రోల్​ ప్లే చేయనున్న కమల్​..

కమలహాసన్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ ‘విక్రమ్’ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాత కూడా కమలహాసనే.. ఆయన సొంత బ్యానర్లో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. విజయ్ సేతుపతి.. ఫాహద్ ఫాజిల్.. నరేన్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ఒక చిత్రమైన స్వభావాన్ని కలిగిన వ్యక్తిగా కొత్త కమల్ ను అభిమానులు చూడనున్నట్లు మూవీ యూనిట్​ తెలిపింది..

అయితే.. కరోనా కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి ఆలస్యంగా వెళ్లింది. ఆ తర్వాత లాక్ డౌన్​ కారణంగా మరింత ఆలస్యమైంది. ఈ మధ్యలో కమల్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా, ఈ సినిమా ఎంతవరకూ షూటింగ్ అయ్యింది.. ఎప్పటికి పూర్తవుతుంది? అనేది అందరిలో కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. ఈ సినిమా షూటింగు దాదాపు కంప్లీట్​ అయ్యిందని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ చెప్పారు. వచ్చేనెలలో ప్రి షూటింగు పార్టు పూర్తవుతుందని అన్నారు. ఈ సినిమాను మార్చి 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మూవీ యూనిట్​..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement